Mahesh Babu: ‘దసరా’పై సూపర్‌స్టార్ అదిరిపోయే ప్రశంస
నాని ‘దసరా’పై ప్రశంసల వర్షం కురిపించారు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu). సినిమా అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు.
హైదరాబాద్: నేచురల్ స్టార్ నాని (Nani) నటించిన ఊరమాస్ ఎంటర్‌టైనర్ ‘దసరా’ (Dasara). శ్రీకాంత్ ఓదెల దర్శకుడు. విడుదలైన రోజు నుంచి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ఈ సినిమాపై సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu) ప్రశంసల వర్షం కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందని, ఈ సినిమా విషయంలో తాను ఎంతగానో గర్విస్తున్నానని అన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై నాని అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మహేశ్‌కు ధన్యవాదాలు చెబుతూ చిత్ర నిర్మాణ సంస్థ రిప్లై ఇచ్చింది.
నాని నటించిన మొదటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది. కీర్తి సురేశ్ కథానాయిక. శ్రీరామ నవమిని పురస్కరించుకుని మార్చి 30న దీనిని విడుదల చేశారు. తెలుగుతోపాటు మిగిలిన భాషల్లోనూ ఇది మంచి టాక్‌ను అందుకుంది. ధరణి, వెన్నెలగా నాని-కీర్తిసురేశ్‌ల నటన కట్టిపడేసేలా ఉందని సోషల్‌మీడియా వేదికగా సినీ ప్రియులు పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Bengaluru: చివరి నిమిషంలో ట్రెవర్ షో రద్దు.. క్షమాపణలు కోరిన బుక్ మై షో
-
Congress MLA: డ్రగ్స్ అక్రమ రవాణా కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
-
Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Team India: నేను ధ్రువీకరించకూడదు.. వారే చెబుతారు: తుది జట్టుపై రాహుల్ ద్రవిడ్
-
Madhya Pradesh rape: ఆటోలో రక్తపు మరకలు.. సాయం కోసం 8 కి.మీ: మధ్యప్రదేశ్ రేప్ ఘటనలో మరిన్ని విషయాలు
-
Evergrande: హాంకాంగ్‌లో ఎవర్‌గ్రాండ్ షేర్ల ట్రేడింగ్ నిలిపివేత