Guntur kaaram: హైదరాబాద్‌లో... ‘గుంటూరు కారం’

సంక్రాంతి పండగ రేసులో ఉన్న సినిమాల పనులతో చిత్రసీమ బిజీ బిజీగా గడుపుతోంది. ఆయా చిత్రబృందాల్లో కొన్ని పూర్వ నిర్మాణ పనులతోనూ...

Updated : 14 Sep 2023 13:51 IST

సంక్రాంతి పండగ రేసులో ఉన్న సినిమాల పనులతో చిత్రసీమ బిజీ బిజీగా గడుపుతోంది. ఆయా చిత్రబృందాల్లో కొన్ని పూర్వ నిర్మాణ పనులతోనూ... మరికొన్నేమో చిత్రీకరణలతోనూ తీరిక లేకుండా పరుగులు పెడుతున్నాయి. సమయం దగ్గర పడుతుండటమే అందుకు కారణం. సంక్రాంతికి విడుదల ఖరారు చేసుకున్న చిత్రాల్లో ‘గుంటూరు కారం’ ఒకటి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో చకచకా జరుగుతోంది. బుధవారం ఓ స్టార్‌ హోటల్‌లో మహేశ్‌బాబు, ప్రకాశ్‌రాజ్‌ తదితరులపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రమిది. శ్రీలీల కథానాయిక. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. భారీ అంచనాలున్న సినిమాల్లో ఇదొకటి. మహేశ్‌ - త్రివిక్రమ్‌ శైలి మాస్‌ అంశాలతో ఈ చిత్రం రూపొందుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని