MS Raju: టికెట్‌ ధరలు తగ్గిస్తేనే మనుగడ

‘‘పెద్ద సినిమాలకి టికెట్‌ ధరలు పెంచినా సమస్య ఉండదు. వాటిపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది.  చిన్న చిత్రాలకి టికెట్‌ ధర  అందుబాటులో ఉండాల్సిందే. ఈ విషయంపై  ప్రభుత్వంతో చర్చించి పరిశ్రమ ఒక నిర్ణయం తీసుకోవాల’’ని కోరారు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌.రాజు. ఆయన దర్శకత్వం వహించిన ‘7 డేస్‌ 6 నైట్స్‌’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Updated : 26 Jun 2022 07:10 IST

‘‘పెద్ద సినిమాలకి టికెట్‌ ధరలు పెంచినా సమస్య ఉండదు. వాటిపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది.  చిన్న చిత్రాలకి టికెట్‌ ధర  అందుబాటులో ఉండాల్సిందే. ఈ విషయంపై  ప్రభుత్వంతో చర్చించి పరిశ్రమ ఒక నిర్ణయం తీసుకోవాల’’ని కోరారు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌.రాజు(MS Raju). ఆయన దర్శకత్వం వహించిన ‘7 డేస్‌ 6 నైట్స్‌’(7 Days 6 Nights) ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఎం.ఎస్‌.రాజు మాట్లాడారు. ‘‘అప్పట్లో టికెట్‌ ధరలు అందుబాటులో ఉండటంతో పరిమిత వ్యయంతో సినిమాలు తీశాం. ఇప్పుడు ‘హ్యాపీడేస్‌’లాంటివి వచ్చినా ఎలా అని ఆలోచించాల్సిన పరిస్థితి. థియేటర్లలో పెద్ద సినిమాలే విడుదల చేయాలేమో అన్నట్టుగా మారింది వ్యవస్థ. ఇది ప్రమాదం’’ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని