Nagarjuna: కొత్త కథలతో కసరత్తులు
నూతన సంవత్సరం ఆరంభమయ్యేలోపు కొత్త సినిమా కథపై నిర్ణయం తీసుకుంటానని ‘ది ఘోస్ట్’ సమయంలోనే చెప్పారు కథానాయకుడు నాగార్జున.
నూతన సంవత్సరం ఆరంభమయ్యేలోపు కొత్త సినిమా కథపై నిర్ణయం తీసుకుంటానని ‘ది ఘోస్ట్’ (The Ghost) సమయంలోనే చెప్పారు కథానాయకుడు నాగార్జున (Nagarjuna). ఈసారి తొందరేమీ లేకుండా... కొంచెం విరామం తీసుకుని ఆ తర్వాతే సినిమాని పట్టాలెక్కిస్తామని అప్పట్లో చెప్పారు. అన్నట్టుగానే కొన్ని నెలలుగా ఆయన కథలపైనే దృష్టిపెడుతూ వస్తున్నారు. సీనియర్ దర్శకులతోపాటు, కొత్తతరం నుంచీ ఆయన కథలు విన్నట్టు తెలిసింది. ‘గాడ్‌ఫాదర్’ ఫేమ్ మోహన్రాజాతోపాటు (Mohan Raja), మరో రచయిత చెప్పిన కథకి సంబంధించి ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో మరో దర్శకుడు విక్రమ్ కె.కుమార్ (Vikram K Kumar) పేరు కూడా వినిపించింది. వీళ్లు చెప్పిన ఏదో ఒక కథతో వచ్చే ఏడాదిలో సినిమా షురూ అయ్యే అవకాశాలున్నాయనేది పరిశ్రమ వర్గాలు చెబుతున్న మాట. 2022ని ‘బంగార్రాజు’తో మొదలుపెట్టిన ఆయన ‘ది ఘోస్ట్’, ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాలతో సందడి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (27/01/2023)
-
World News
Handsome Man: శాస్త్రీయంగా ప్రపంచంలోనే అందమైన వ్యక్తి ఎవరంటే?
-
India News
Arvind Kejriwal: చర్చలకు పిలిచిన సక్సేనా.. నో చెప్పిన కేజ్రీవాల్
-
Technology News
Cola Phone: కోకాకోలా కొత్త స్మార్ట్‌ఫోన్.. విడుదల ఎప్పుడంటే?
-
Movies News
Haripriya: ఒక్కటైన ‘కేజీయఫ్’ నటుడు, ‘పిల్ల జమీందార్’ నటి
-
World News
Pakistan: పాక్ సంక్షోభం.. కనిష్ఠ స్థాయికి పడిపోయిన రూపాయి