Bangarraju: పోటీలోకి ‘బంగార్రాజు’ వస్తున్నాడా? నాగార్జున నిర్ణయం ఏంటి?

నాగార్జున కథానాయకుడిగా కల్యాణకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బంగార్రాజు’. నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు.

Published : 18 Nov 2021 17:32 IST

హైదరాబాద్‌: నాగార్జున కథానాయకుడిగా కల్యాణకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బంగార్రాజు’. నాగచైతన్య కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా విడుదలపై ప్రస్తుతం ఆసక్తి నెలకొంది. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ‘బంగార్రాజు’ను సంక్రాంతి కానుకగా విడుదల చేస్తే ఎలా ఉంటుంది? అన్న దానిపై ప్రస్తుతం చిత్ర బృందం చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే, దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదట.

ఇప్పటికే సంక్రాంతి రేసులో స్టార్‌ హీరోల సినిమాలు ఉన్నాయి. ముగ్గుల పండగకు ముందుగానే ‘ఆర్ఆర్ఆర్‌’ సందడి చేయనుండగా, ప్రభాస్‌ ‘రాధేశ్యామ్‌’ వారం ఆగి రానుంది. తాను కూడా వెనక్కి తగ్గేది లేదు అంటూ ‘భీమ్లానాయక్‌’ దూసుకొస్తున్నారు. సినిమా విడుదల వాయిదా విషయంలో మరో ఆలోచన చేయకుండా, సంక్రాంతి బరిలోనే దించాలని పవన్‌ గట్టి పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ‘భీమ్లానాయక్‌’ వెనక్కి తగ్గితే తమ చిత్రాన్ని రేసులో పెట్టాలని ‘బంగార్రాజు’ చిత్ర బృందం భావిస్తోందట. దీంతో పవన్‌ సినిమా విడుదలపై నాగార్జున సినిమా ప్రకటన ఆధారపడి ఉంది. ఏదేమైనా ఈ సంక్రాంతికి సినిమా సందడి మామూలుగా ఉండదు.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని