Tollywood: ‘ఓసీ’ కథేంటి?

కిరణ్‌ లోవ, లక్ష్మి కిరణ్‌, హరీష్‌ బొంపల్లి, మంజీర ప్రధాన పాత్రల్లో కిరణ్‌, విష్ణు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓసీ’. విష్ణు శరణ్‌ బొంపల్లి నిర్మాత. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో   లాంఛనంగా ప్రారంభమైంది.

Updated : 17 Feb 2022 09:04 IST

కిరణ్‌ లోవ, లక్ష్మి కిరణ్‌, హరీష్‌ బొంపల్లి, మంజీర ప్రధాన పాత్రల్లో కిరణ్‌, విష్ణు సంయుక్తంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఓసీ’. విష్ణు శరణ్‌ బొంపల్లి నిర్మాత. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో   లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు వి.వి.వినాయక్‌ క్లాప్‌ నివ్వగా.. మునిరాజ్‌ గుత్తా కెమెరా స్విచ్చాన్‌ చేశారు. సత్య మాస్టర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు కిరణ్‌ మాట్లాడుతూ.. ‘‘విషయం ఉన్న వాడు విలేజ్‌లో ఉన్నా ఏదైనా సాధించగలడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. షూటింగ్‌ మొత్తం హైదరాబాద్‌లోనే ఉంటుంది’’ అన్నారు. ‘‘ఈ చిత్రానికి కథే హీరో. మా తొలి ప్రయత్నాన్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత. ఈ చిత్రానికి సంగీతం: అక్షర్‌ బ్యాండ్‌ పివియల్‌యన్‌ మూర్తి, ఛాయాగ్రహణం: నట్రాజ్‌ అయాన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని