Hansika: రెప్పే వేసేలోగా..
హన్సిక ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు.
హన్సిక ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న చిత్రం ‘మై నేమ్ ఈజ్ శృతి’. శ్రీనివాస్ ఓంకార్ దర్శకత్వం వహిస్తున్నారు. వైష్ణవి ఆర్ట్స్ పతాకంపై బురుగు రమ్య ప్రభాకర్ నిర్మిస్తున్నారు. మంగళవారం ఈ సినిమాలోని ‘రెప్పే వేసేలోగా మారిందేమో నా రాత, తప్పే చేసేలాగా ముప్పే వచ్చే నా వెంట...’ అంటూ సాగే పాటకి సంబంధించిన లిరికల్ వీడియోని విడుదల చేశారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించిన ఈ గీతాన్ని హారిక నారాయణ్ ఆలపించారు. మార్క్ రాబిన్ స్వరకర్త. ఈ సందర్భంగా హన్సిక మాట్లాడుతూ ‘‘ఇలాంటి కథని నేనెప్పుడూ చేయలేదు. సినిమాలో ఉండే మలుపులు అందరిలోనూ ఆశ్చర్యాన్ని రేకెత్తిస్తాయ’’న్నారు. నిర్మాత మాట్లాడుతూ ‘‘వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో రూపొందుతున్న చిత్రమిది. ప్రతీ సన్నివేశాన్నీ దర్శకుడు ఎంతో ఆసక్తికరంగా మలుస్తున్నార’’న్నారు. మలుపులు ప్రేక్షకుల్ని రక్తికట్టిస్తాయని దర్శకుడు చెప్పారు. మురళీశర్మ, ఆడుకలం నారాయణ్, జయప్రకాష్, ప్రవీణ్, సీవీఎల్ నరసింహారావు, పూజా రామచంద్రన్, కేదార్‌శంకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: కిషోర్ బోయిడపు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
విజయ్ దేవరకొండ తన తర్వాత ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. -
అందుకే సినిమాల నుంచి కొంత విరామం తీసుకున్నా: షారుక్ ఖాన్
మూడు సినిమాల తర్వాత కొంత సమయం విశ్రాంతి తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు షారుక్ చెప్పారు. -
రివ్యూ: ప్రణయ విలాసం.. ‘ప్రేమలు’ హీరోయిన్ నటించిన సినిమా ఎలా ఉందంటే?
మమితా బైజు, అర్జున్ అశోకన్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రణయ విలాసం’. ‘ఈటీవీ విన్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా కథేంటంటే? -
ఆ ‘రెండేళ్ల షరతు’ త్రిష జీవితాన్నే మార్చేసింది.. అదేంటంటే?
త్రిష పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం.. -
జులై నుంచి ప్రేమలో..
ప్రభాస్ ప్రేమకథకి ముహూర్తం కుదిరింది. జులై నుంచే ఆయన కొత్త ప్రేమాయణం మొదలు కానుంది. ఇప్పటికే స్క్రిప్ట్ పక్కాగా సిద్ధమైనట్టు సినీ వర్గాలు తెలిపాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో... అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. -
సంయుక్త.. ఊ కొట్టేనా?
తెలుగు చిత్రసీమలోకి వచ్చిన అనతి కాలంలోనే వరుస విజయాలందుకుంటూ స్టార్ నాయిక స్థాయికి చేరుకుంది సంయుక్తా మేనన్. ప్రస్తుతం ఆమె తెలుగులో ‘స్వయంభూ’తో పాటు శర్వానంద్‌తోనూ ఓ చిత్రం చేస్తోంది. -
ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది
‘నేను మొదటగా సంతోషపడేది నన్ను నేను తెరపై చూసుకున్నప్పుడే’ అని అంటోంది బాలీవుడ్ కథానాయిక యామీ గౌతమ్. ‘ఆర్టికల్ 370’తో భారీ విజయాన్ని అందుకుందీమె. హిందీలోనే కాదు తెలుగు చిత్రాల్లోనూ నటించి టాలీవుడ్ ప్రేక్షకులను అలరించింది. -
వాణీ కోసమే ఈ పాత్ర!
నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్ని ఎంచుకుంటూ ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది బాలీవుడ్ నాయిక వాణీ కపూర్. ఇప్పుడామె మరో కొత్త ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపింది. ఆమె ప్రధాన పాత్రలో ‘బడ్తమీజ్ గిల్’ అనే సినిమా రాబోతున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. -
‘కన్నప్ప’లో అక్షయ్ పని పూర్తి
‘కన్నప్ప’తో సినీప్రియుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నారు మంచు విష్ణు. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్నారు. మోహన్‌బాబు నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. -
సమ్మోహనం.. ఈ కలయిక
అపూర్వమైన కలయికలు కొన్ని ఉంటాయి. వాళ్లు కలిశారంటే చాలు... సినిమాకి క్లాప్ కొట్టిన రోజే బ్లాక్‌బస్టర్ బొమ్మని తెరపై చూసేసినంత సంబరం. రజనీకాంత్ - అమితాబ్ బచ్చన్ కలయిక అచ్చం అలాంటిదే. భారతదేశం గర్వించదగ్గ తారలు ఈ ఇద్దరూ. -
త్వరలో కుందాపురానికి ‘కాంతార 1’
‘కాంతార’ సినిమాతో జాతీయ స్థాయిలో సత్తా చాటారు రిషబ్ శెట్టి. ఇప్పుడీ సినిమాకి ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్ 1’ సిద్ధమవుతోంది. రిషబ్ హీరోగా నటిస్తూ.. స్వయంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. హోంబలే ఫిల్మ్స్ సంస్థ నిర్మిస్తోంది. -
ఏమయ్యిందే గుండెకు.. ఏనాడు లేదే ఇంత ఉలుకు
అశోక్ గల్లా హీరోగా అర్జున్ జంధ్యాల తెరకెక్కిస్తున్న చిత్రం ‘దేవకీ నందన వాసుదేవ’. సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. వారణాసి మానస కథానాయిక. ప్రస్తుతం ముగింపు దశలో ఉన్న ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్
రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి దిగిన ఫొటోలు వైరల్‌గా మారాయి. వారిద్దరూ ఎక్కడ మీట్ అయ్యారంటే?
తాజా వార్తలు (Latest News)
-
17మంది రోగులను హత్య చేసిన నర్సు..700 ఏళ్ల జైలు శిక్ష
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన రోహిత్ వేముల తల్లి..
-
కొత్త సినిమా ప్రకటించిన విజయ్ దేవరకొండ.. డైరెక్టర్ ఎవరంటే!
-
10 వేలమంది అనుచరులు.. 700 వాహనాలు: కుమారుడి నామినేషన్ వేళ బ్రిజ్‌భూషణ్ హడావుడి
-
రోహిత్‌కు ఏమైంది? ఇంపాక్ట్ ప్లేయర్‌గా రావడానికి కారణమిదే!