Sekhar: చిన్ని చిన్ని ప్రాణం.. చిందులాడే పాదం

రాజశేఖర్‌ హీరోగా జీవిత తెరకెక్కించిన చిత్రం ‘శేఖర్‌’. బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజ   శేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం సంయుక్తంగా నిర్మించారు. ఆత్మీయ రాజన్‌ కథానాయిక.

Updated : 14 May 2022 12:28 IST

రాజశేఖర్‌ హీరోగా జీవిత తెరకెక్కించిన చిత్రం ‘శేఖర్‌’. బీరం సుధాకర్‌ రెడ్డి, శివాని రాజ   శేఖర్‌, శివాత్మిక రాజశేఖర్‌, వెంకట శ్రీనివాస్‌ బొగ్గరం సంయుక్తంగా నిర్మించారు. ఆత్మీయ రాజన్‌ కథానాయిక. ఈ సినిమా మే 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ చిత్రంలోని ‘‘చిన్ని చిన్ని ప్రాణం.. చిందులాడే పాదం’’ అనే గీతాన్ని విడుదల చేశారు. ఈ పాటకు అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చగా.. రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. చిన్మయి, హైమత్‌ మహ్మద్‌ సంయుక్తంగా ఆలపించారు. ‘‘విభిన్నమైన క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో రూపొందుతోన్న చిత్రమిది. యాక్షన్‌కు ప్రాధాన్యముంది. ఇందులో రాజశేఖర్‌ రెండు భిన్నమైన లుక్‌లలో కనిపించనున్నార’’ని సినీ వర్గాలు తెలిపాయి. దీనికి కళ: సంపత్‌, రచయిత: లక్ష్మీ భూపాల, ఛాయాగ్రహణం: మల్లికార్జున్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని