Sita Ramam: ఓ సీతా... హే రామా

‘ఓ సీతా... వదలనిక తోడవుతా, రోజంతా వెలుగులిడు నీడవుతా...’  అని పాడుతున్న రామ్‌ కథేమిటో తెలియాలంటే ‘సీతారామం’ చూడాల్సిందే. దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా... స్వప్న సినిమా పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది. మృణాల్‌

Updated : 10 May 2022 12:19 IST

‘ఓ సీతా... వదలనిక తోడవుతా, రోజంతా వెలుగులిడు నీడవుతా...’  అని పాడుతున్న రామ్‌ కథేమిటో తెలియాలంటే ‘సీతారామం’ చూడాల్సిందే. దుల్కర్‌ సల్మాన్‌ కథానాయకుడిగా... స్వప్న సినిమా పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. రష్మిక మందన్న ముఖ్యభూమిక పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్నారు. అశ్వనీదత్‌, ప్రియాంకదత్‌ నిర్మిస్తున్నారు. వైజయంతీ మూవీస్‌ సమర్పిస్తోంది. ఈ చిత్రంలోని ‘ఓ సీతా... హే రామా’ అంటూ సాగే గీతాన్ని సోమవారం విడుదల చేశారు. విశాల్‌ చంద్రశేఖర్‌ స్వరకల్పనలోని ఈ పాటని అనంతశ్రీరామ్‌ రచించగా, ఎస్పీ చరణ్‌, రమ్య బెహరా ఆలపించారు. ‘‘యుద్ధం నేపథ్యంలో సాగే ఓ అందమైన ప్రేమకథ ఇది. సంగీతప్రేమికుల మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోయేలా ఇందులోని పాటలు ఉంటాయి. సీతగా మృణాళిని, లెఫ్టినెంట్‌ రామ్‌గా దుల్కర్‌ సల్మాన్‌ ఆకట్టుకుంటారు. వాళ్లిద్దరిపై     తెరకెక్కించిన ‘ఓ సీతా...’ పాటకి లభిస్తున్న స్పందన చాలా బాగుంది. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో చిత్రాన్ని రూపొందిస్తున్నామ’’ని సినీ వర్గాలు తెలిపాయి. రష్మిక.. అఫ్రీన్‌ అనే యువతి పాత్రని పోషించారు. సుమంత్‌, గౌతమ్‌మేనన్‌, ప్రకాష్‌రాజ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: పి.ఎస్‌.వినోద్‌.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని