Rajamouli: అంతకుమించి...

అగ్ర దర్శకుడు రాజమౌళి సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. తన పనితీరుతో వాటిని అంతకంతకూ పెంచేస్తుంటారాయన. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఓటీటీలో వచ్చాక ఆ సినిమా మరింత మంది ప్రేక్షకులకు చేరువైంది.

Updated : 02 Oct 2022 08:31 IST

గ్ర దర్శకుడు రాజమౌళి (Rajamouli) సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. తన పనితీరుతో వాటిని అంతకంతకూ పెంచేస్తుంటారాయన. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు (RRR) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఓటీటీలో వచ్చాక ఆ సినిమా మరింత మంది ప్రేక్షకులకు చేరువైంది. ఇటీవల అమెరికాలో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఆ సందర్భంగా వచ్చిన స్పందనని ఆస్వాదిస్తూనే, తదుపరి  మహేష్‌ బాబుతో తీయబోయే సినిమా గురించి రాజమౌళి  మాట్లాడారు. తన కెరీర్‌లో ఇప్పటిదాకా తీసిన సినిమాల్లో అతి పెద్ద చిత్రంగా అది ఉండబోతోందని, యాక్షన్‌ ప్రధానంగా తెరకెక్కనుందని తెలిపారు. ‘బాహుబలి’, ఆ తర్వాత ‘ఆర్‌ఆర్‌ఆర్‌’.... ఇలా ఆయా సందర్భాల్లో అత్యధిక వ్యయంతో రూపొందిన సినిమాలివి. తదుపరి సినిమా మరింత భారీ స్థాయిలో ఉంటుందని రాజమౌళి చెప్పడంతో అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని