Rajamouli: కృషితో కల నెరవేరుతుంది

గౌరీశ్‌ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్‌ నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఓ కల’. దీపక్‌ కొలిపాక దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మీనవ్య మోతూరు, రంజిత్‌కుమార్‌ కొడాలి, ఆదిత్య రెడ్డి నిర్మాతలు. దీని ఫస్ట్‌లుక్‌ని శనివారం

Updated : 08 May 2022 10:19 IST

గౌరీశ్‌ యేలేటి, రోషిణి, ప్రాచీ ఠక్కర్‌ నాయకానాయికలుగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఓ కల’. దీపక్‌ కొలిపాక దర్శకత్వం వహిస్తున్నారు. లక్ష్మీనవ్య మోతూరు, రంజిత్‌కుమార్‌ కొడాలి, ఆదిత్య రెడ్డి నిర్మాతలు. దీని ఫస్ట్‌లుక్‌ని శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘సినిమా అనేది చాలా మంది కల. ఈ చిత్ర బృందం ఆ కలని నెరవేర్చుకుంది. ఇంకా ఎంతోమంది ఈ కలతో బతుకుతున్నారు. గట్టిగా కృషి చేస్తే వాళ్లందరి కల నెరవేరుతుంది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ ఆకర్షణీయంగా ఉంది. దర్శకుడు దీపక్‌ కొలిపాక ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని భావిస్తున్నా’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘రాజమౌళి చేతులమీదుగా మా ఫస్ట్‌లుక్‌ విడుదల కావడం ఆనందంగా ఉంది. ఆయనెప్పుడూ  దర్శకులకి గొప్ప స్ఫూర్తి. వాణిజ్యాంశాల్ని మేళవించిన ఓ మంచి వినోదాత్మక చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ‘హిట్‌’ సినిమా దర్శకుడు శైలేష్‌ కొలనుతోపాటు, చిత్రబృందం పాల్గొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని