Raviteja: పూర్తయింది...‘రావణాసుర’..

రవితేజ (Raviteja) కథానాయకుడిగా సుధీర్‌ వర్మ తెరకెక్కిస్తున్న చిత్రం ‘రావణాసుర’ (Ravanasura). అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌.టి టీమ్‌ వర్క్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Updated : 27 Feb 2023 06:42 IST

వితేజ (Raviteja) కథానాయకుడిగా సుధీర్‌ వర్మ (Sudheer Varma) తెరకెక్కిస్తున్న చిత్రం ‘రావణాసుర’ (Ravanasura). అభిషేక్‌ పిక్చర్స్‌, ఆర్‌.టి టీమ్‌ వర్క్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అను ఇమ్మాన్యుయేల్‌, మేఘా ఆకాష్‌, ఫరియా అబ్దుల్లా, దక్షా నగార్కర్‌, పూజిత పొన్నాడ కథానాయికలు. ఈ సినిమా తాజాగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. ఇటీవలే హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో నాయకానాయికలపై ఓ పాటను చిత్రీకరించినట్లు తెలిపింది. దీనికి శేఖర్‌ మాస్టర్‌ నృత్యరీతులు సమకూర్చారు. విభిన్నమైన స్టైలిష్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రంలో రవితేజ న్యాయవాదిగా కనిపించనున్నారు. హీరో సుశాంత్‌ కీలక పాత్ర పోషించారు. ఈ సినిమా ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, భీమ్స్‌ సిసిరోలియో, ఛాయాగ్రహణం: విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని