Tabu: అప్పుడు కష్టపడ్డా... ఇప్పుడు ఆనందిస్తున్నా

ఉత్తరాదితో పాటు దక్షిణాది ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటి టబు. నాలుగు దశాబ్దాలుగా నటిగా కొనసాగుతూ ఎన్నో విజయాలు అందుకున్నారామె.

Updated : 04 Dec 2022 07:06 IST

త్తరాదితో పాటు దక్షిణాది ప్రేక్షకులకు బాగా పరిచయమున్న నటి టబు (Tabu). నాలుగు దశాబ్దాలుగా నటిగా కొనసాగుతూ ఎన్నో విజయాలు అందుకున్నారామె. ఈ ఏడాది కూడా ఆమెకు బాగా కలిసొచ్చింది. ‘భూల్‌ భులయ్యా 2’తో (Bhool Bhulaiyaa 2) హిట్‌ కొట్టిన ఈ నాయిక ఇటీవలే విడుదలైన దృశ్యం 2 తో (Drishyam 2) మరో విజయాన్ని ఖాతాలో వేసుకొంది. ఈ విజయాల వెనుక ఎంతో కష్టం ఉందని చెబుతున్నారామె. ‘‘గత సంవత్సరన్నరగా ఒకేసారి నాలుగైదు సినిమాలకు పనిచేశాను. కష్టంగానూ, ఛాలెంజింగ్‌గానూ అనిపించింది. కొవిడ్‌ సమయంలో మరిన్ని ఇబ్బందులొచ్చాయి. అయినా సరే లెక్కచేయలేదు. నా పనిని ఎంజాయ్‌ చేశాను. ఇప్పుడు విజయాల్ని ఆస్వాదిస్తున్నాను’’అని చెప్పారు టబు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని