Ved Movie: అభిమాని కాళ్లుపట్టుకున్న స్టార్ హీరో.. వైరల్ అవుతున్న వీడియో..
సినిమా తారలతో ఫొటోలు దిగాలని అంతా అనుకుంటారు. అలాంటిది స్టార్ హీరోనే అభిమాని కాళ్లు పట్టుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
హైదరాబాద్: టాలీవుడ్‌లో హాసినిగా అందరి మనసులు దోచేసింది జెనీలియా(Genelia). ఈ అమ్మడికి ఉన్న ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. తాజాగా ఈ క్యూట్ హీరోయిన్ తన భర్త రితేష్ దేశ్‌ముఖ్(Riteish Deshmukh)తో కలిసి నటించిన సినిమా ‘వేద్’(Ved). తెలుగులో విడుదలై సూపర్ హిట్ అయిన ‘మజిలీ’(Majili)కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో రితేష్ చేసిన పని ప్రస్తుతం వైరల్‌గా మారింది. సోషల్‌మీడియా వేదికగా ఈ స్టార్ హీరోకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
వేద్ సినిమా ప్రమోషన్స్ కోసం చిత్రబృందం ఓ కాలేజీకి వెళ్లింది. అక్కడ ఓ యువతి రితేష్‌ని తనతో డాన్స్ చేయాలని కోరింది. వెంటనే రితేష్ అమెతో డాన్స్ చేశాడు. దాంతో ఆనందం తట్టుకోలేక పోయిన యువతి ఈ స్టార్ హీరో కాళ్లు పట్టుకుంది. దీంతో రితేష్ వెంటనే ఆమెను హత్తుకుని ఆమె కాళ్లు పట్టుకుని ఇంతలా అభిమానం చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపాడు. రితేష్ ప్రవర్తనకు అక్కడ ఉన్న వారంతా ఫిదా అయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడమంటే ఇదే అంటూ రితేష్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇక వేద్ సినిమాలో రితేష్ నటించడంతో పాటు స్వయంగా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్‌గా జెనీలియా నటిస్తోంది. బాలీవుడ్ అగ్రహీరో సల్మాన్‌ఖాన్ (Salman khan)కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం డిసెంబర్30న విడుదలవ్వనుంది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
కన్నతండ్రి దూరమైనా తరగని ప్రేమ.. భౌతికకాయం ముందే పెళ్లి చేసుకున్న కుమారుడు
-
India News
Usha Gokani: మహాత్మాగాంధీ మనవరాలి కన్నుమూత
-
Politics News
TDP: ఎమ్మెల్యే భవాని సభలో లేకున్నా ‘సాక్షి’లో తప్పుడు ఫొటో: తెదేపా ఎమ్మెల్యే స్వామి
-
India News
the elephant whisperers: ఆస్కార్ లఘుచిత్ర దర్శకురాలికి రూ.కోటి నజరానా
-
India News
వాహ్.. బేటా!.. తాజ్ చూపించి తల్లి కోరిక తీర్చిన తనయుడు
-
Crime News
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో యువకుడి మృతి