Samantha: మళ్లీ పెళ్లి.. నెటిజన్‌ ప్రశ్నకు సమంత రియాక్షన్‌ ఏంటంటే?

ఓ నెటిజన్‌ మళ్లీ పెళ్లి టాపిక్‌ తీసుకురాగా.. సమంత స్పందించారు. ఆమె ఏమన్నారంటే?

Published : 18 Dec 2023 02:10 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటి సమంత (Samantha) సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అభిమానులు, నెటిజన్లతో పలు విశేషాలు పంచుకుంటారు. అప్పుడప్పుడు వారితో చిట్‌చాట్‌ నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో వారు అడిగే ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానమిచ్చి, ఆకట్టుకుంటారు. ‘మళ్లీ పెళ్లిపై మీరెందుకు ఆలోచించకూడదు?’ అని తాజాగా ఓ నెటిజన్‌ ప్రశ్నించగా ఆమె స్పందించారు. విడాకులకు సంబంధించిన గణాంకాల వివరాలను చూపిస్తూ.. వీటి ప్రకారం అది బ్యాడ్‌ ఇన్వెస్టిమెంట్‌ అని పేర్కొన్నారు. దానికి స్మైలీ ఎమోజీ జోడించారు. ‘కీ డివోర్స్‌ స్టాటిస్టిక్స్‌’ పేరిట సమంత షేర్‌ చేసిన ఇమేజ్‌లో.. 2023లో.. మొదటి పెళ్లి విడాకులు 50 శాతం ఉండగా, రెండో, మూడోసారి పెళ్లిళ్ల విడాకులు 67 శాతం, 73 శాతంగా ఉంది. స్త్రీ, పురుషుల విషయంలోనూ ఈ రేటింగ్‌ ఇలానే ఉందట. ‘మీరు దేవుడిని నమ్ముతారా?’ అని ఓ అభిమాని అడగ్గా నమ్ముతానని సమంత చెప్పారు.

మహేశ్‌బాబుతో సితార సెల్ఫీ.. చీరలో కాజల్‌ సింప్లిసిటీ!

ఇటీవల.. ‘ఖుషి’ (Kushi)తో అలరించిన సమంత త్వరలో ‘సిటాడెల్‌’ (ఇండియన్‌ వెర్షన్‌) (Citadel) వెబ్‌సిరీస్‌తో సందడి చేయనున్నారు. బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ ధావన్‌ మరో కీలక పాత్రధారి. రాజ్‌, డీకే దర్శకత్వం వహించారు. సిటాడెల్‌ మాతృకలో ప్రియాంక చోప్రా, రిచర్డ్‌ మేడెన్‌ నటించిన సంగతి తెలిసిందే. మరోవైపు, సమంత కొన్ని రోజుల క్రితం నిర్మాతగా మారారు. ‘ట్రా లా లా మూవింగ్‌ పిక్చర్స్‌’ పేరుతో నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించారు. కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తూ.. అర్థవంతమైన, ప్రామాణికమైన, విశ్వజనీనమైన కథల్ని ఈ వేదికపై నిర్మించనున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని