NBK 108: బాలకృష్ణ కోసం శరత్‌ కుమార్‌

కథానాయకుడు బాలకృష్ణ.. దర్శకుడు అనిల్‌ రావిపూడి కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Updated : 18 Dec 2022 07:00 IST

కథానాయకుడు బాలకృష్ణ (BalaKrishna).. దర్శకుడు అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కలయికలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీలీల (Sreeleela) కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. కాగా, ఈ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర కోసం నటుడు శరత్‌ కుమార్‌ను (Sarath Kumar) రంగంలోకి దించింది చిత్ర బృందం. ఈ విషయాన్ని దర్శకుడు అనిల్‌ శనివారం వెల్లడించారు. ఈ సందర్భంగా సెట్లో ఆయనతో కలిసి దిగిన ఓ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘‘ఓ శక్తిమంతమైన కథతో రూపొందుతోన్న చిత్రమిది. బాలకృష్ణ శైలి మాస్‌ యాక్షన్‌తో పాటు అనిల్‌ రావిపూడి మార్క్‌ ఎలిమెంట్స్‌ ఉంటాయి. ఇందులో బాలయ్య మునుపెన్నడూ పోషించని పాత్రలో కనిపిస్తారు’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: తమన్‌, కూర్పు: తమ్మిరాజు, ఛాయాగ్రహణం: సి.రామ్‌ప్రసాద్‌.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు