పెళ్లి కూతురు రెడీ.. రకుల్‌ తలకిందులు 

మరికొన్ని నిమిషాల్లో చైతన్య మెగా వారసురాలు నిహారిక మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు. ఇప్పటికే నిహారిక ఎరుపు రంగు చీరలో పెళ్లి కుమార్తెగా ముస్తాబయ్యారు. మరోపక్క బుధవారం ఉదయం జరిగిన హల్దీ వేడుక ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి....

Published : 10 Dec 2020 01:08 IST

సోషల్‌ లుక్‌: తారలు పంచుకున్న విశేషాలు

* మరికొన్ని నిమిషాల్లో చైతన్య మెగా వారసురాలు నిహారిక మెడలో మూడు ముళ్లు వేయబోతున్నారు. ఇప్పటికే నిహారిక ఎరుపు రంగు చీరలో పెళ్లి కుమార్తెగా ముస్తాబయ్యారు. మరోపక్క బుధవారం ఉదయం జరిగిన హల్దీ వేడుక ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

* కథానాయిక రకుల్‌ప్రీత్‌ సింగ్‌ చాలా రోజుల తర్వాత యోగా తరగతులకు హాజరయ్యారట. ఈ విషయాన్ని తెలుపుతూ ఆమె వీడియో షేర్‌ చేశారు. తాడు సాయంతో తలకిందులుగా మారి కనిపించారు. రకుల్‌ ఇటీవల వియారయాత్ర నిమిత్తం మాల్దీవులకు వెళ్లారు. అక్కడ దాదాపు వారం రోజులు గడిపి, ఇటీవల భారత్‌ చేరుకున్నారు.

* బాలీవుడ్‌ స్టార్‌ సల్మాన్‌ ఖాన్‌ మరోసారి తన కండలు చూపించి ఫిట్‌నెస్‌ పరంగా స్ఫూర్తి నింపారు. చొక్కా లేకుండా ఆయన షేర్‌ చేసిన ఫొటో వైరల్‌గా మారింది. 

* ‘జీవితంలో అమూల్యమైన విషయం ఒకటే. కుటుంబ సభ్యులతో వీలైనంత సమయం గడపడం’ అంటున్నారు మంచు లక్ష్మి. తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి తీసుకున్న ఫొటోలు షేర్‌ చేశారు.

ఇదీ చదవండి..
పవన్‌ వచ్చేశాడు.. పూల్‌ పార్టీలో నిహారిక

 














Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని