Adipurush: ‘ఆదిపురుష్‌’డి చిత్రంలో సోనాల్‌

ప్రభాస్‌ కథానాయకుడిగా భారీస్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ఇందులో బాలీవుడ్‌ భామ సోనాల్‌ చౌహాన్‌ అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. అయితే ఇందులో

Updated : 13 Apr 2022 11:03 IST

ప్రభాస్‌ కథానాయకుడిగా భారీస్థాయిలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదిపురుష్‌’. ఇందులో బాలీవుడ్‌ భామ సోనాల్‌ చౌహాన్‌ అవకాశం దక్కించుకుంది. ఈ విషయాన్ని చిత్రబృందం ప్రకటించింది. అయితే ఇందులో ఆమె పాత్ర ఏంటి? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. కృతి సనన్‌ కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రం ద్వారా రామాయణ గాథను సరికొత్త రీతిలో చూపించనున్నారు. ఈ తరహా చిత్రంలో నటించడం  ఇదే మొదటిసారని సోనాల్‌ సంతోషం వ్యక్తం చేసింది. ఈ చిత్రాన్ని బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్నారు. నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ‘ఘోస్ట్‌’లోనూ సోనాల్‌ నటిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని