Suriya: ఆస్కార్‌ ప్యానల్‌లో సూర్య

తమిళ కథానాయకుడు సూర్య అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఆస్కార్‌ పురస్కారాలు అందజేసే అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌లో ప్యానెల్‌ సభ్యుడిగా అవకాశం అందుకున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు ప్రపంచవ్యాప్తంగా 397 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఇం

Updated : 30 Jun 2022 09:18 IST

మిళ కథానాయకుడు సూర్య(Suriya) అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఆస్కార్‌ (Oscars) పురస్కారాలు అందజేసే అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌లో ప్యానెల్‌ సభ్యుడిగా అవకాశం అందుకున్నారు. ఈ కమిటీలో సభ్యులుగా ఉండేందుకు ప్రపంచవ్యాప్తంగా 397 మంది ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. ఇందులో 15 మంది ఆస్కార్‌ విజేతలతో పాటు 71 మంది ఆస్కార్‌ నామినీలు ఉన్నారు. భారత్‌ నుంచి సూర్యతో పాటు నటి కాజోల్‌ (Kajol), దర్శకురాలు రీమా కగ్జి, నిర్మాతలు ఆదిత్య సూద్‌, సుష్మిత్‌ ఘోష్‌, రింటు థామస్‌లకు ఈ అవకాశం అందింది. ఇలా ఆస్కార్‌ ఆర్గనైజర్స్‌ మెంబర్‌ షిప్‌ దక్కించుకున్న తొలి దక్షిణాది నటుడు సూర్యనే. ఆయన నటించిన ‘జై భీమ్‌’, ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాలు గతంలో ఆస్కార్‌ నామినేషన్స్‌ దక్కించుకున్నాయి. ఈ ఏడాదికి గానూ ఆస్కార్‌ ఆర్గనైజర్స్‌ మెంబర్‌ షిప్‌ దక్కించుకున్న వాళ్లలో 44శాతం మహిళలు కాగా.. 37శాతం మంది అంతగా ప్రాతినిధ్యం లేని వర్గాలకు చెందినవారు. మిగిలిన వాళ్లలో అమెరికా వెలుపల ఉన్న 53 దేశాలకు చెందిన వారు ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని