Kaikala Satyanarayana: కైకాలకి అస్వస్థత

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆస్పత్రిలో చేరారు. నాలుగు రోజుల క్రితం ప్రమాదవశాత్తూ ఇంట్లో జారిపడటంతో ఆయన  మోకాలికి గాయమైంది. చికిత్స అనంతరం నొప్పి అధికం...

Updated : 01 Nov 2021 07:33 IST

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ ఆస్పత్రిలో చేరారు. నాలుగు రోజుల క్రితం ప్రమాదవశాత్తూ ఇంట్లో జారిపడటంతో ఆయన  మోకాలికి గాయమైంది. చికిత్స అనంతరం నొప్పి అధికం కావడంతో శనివారం రాత్రి ఆయన్ని కుటుంబ సభ్యులు సికింద్రాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. ఐదు దశాబ్దాలుగా వందల చిత్రాల్లో నటించి నవరస నటసార్వభౌమగా పేరు తెచ్చుకున్నారు సత్యనారాయణ. కొంతకాలంగా ఆయన వెండితెరకు దూరంగా ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని