Athidi Devo Bhava: ఈసారి కచ్చితంగా హిట్‌ కొడతాం

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా పొలిమేర నాగేశ్వర్‌ తెరకెక్కించిన చిత్రం ‘అతిథి దేవో భవ’. రాజాబాబు మిర్యాల, అశోక్‌ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మించారు. నువేక్ష కథానాయిక. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య

Updated : 15 Aug 2022 16:21 IST

ది సాయికుమార్‌ కథానాయకుడిగా పొలిమేర నాగేశ్వర్‌ తెరకెక్కించిన చిత్రం ‘అతిథి దేవో భవ’. రాజాబాబు మిర్యాల, అశోక్‌ రెడ్డి మిర్యాల సంయుక్తంగా నిర్మించారు. నువేక్ష కథానాయిక. ఈ సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్‌లో ప్రీరిలీజ్‌ వేడుక నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో రాజశేఖర్‌ మాట్లాడుతూ ‘‘ఆది చిత్రం కోసం ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది. పాటలు వింటుంటే సినిమా బాగుంటుందని అర్థమవుతోంది. ఈ చిత్రంతో ఆదికి పెద్ద సక్సెస్‌ రావాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’’ అన్నారు. ‘‘మొన్నే ఈ చిత్రం చూశా. అందమైన ప్రేమకథతో రూపొందింది. మంచి వినోదం ఉంది. సినిమా ఏ ఒక్కరినీ నిరాశ పరచదు. కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు నిర్మాత మిర్యాల రవీందర్‌ రెడ్డి. హీరో ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ ‘‘అందరం కలిసి ఓ మంచి చిత్రం తీశామన్న నమ్మకం ఉంది. నిర్మాతలు ఎంతో కష్టపడి సినిమాని నిర్మించారు. సినిమాలో నువేక్షకు నాకు మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. సప్తగిరి కామెడీ నవ్వులు పూయిస్తుంది. పాటలు మంచి హిట్టయ్యాయి. సినిమానీ అలాగే ఆదరిస్తారని ఆశిస్తున్నా’’ అన్నారు. ‘‘ఇది వరకు చేసిన జానర్ల కంటే ప్రత్యేకంగా ఉండే చిత్రమిది. ఈసారి కచ్చితంగా హిట్‌ కొడతామని నమ్మకంగా ఉంది. అమర్‌ ఫొటోగ్రఫీ అద్భుతంగా కుదిరింది. సప్తగిరి కామెడీ సినిమాకి ప్రధాన ఆకర్షణ. ప్రథమార్ధం వినోదభరితంగా, ద్వితీయార్ధం చాలా కొత్తగా ఉంటుంది’’ అన్నారు దర్శకుడు. ఈ కార్యక్రమంలో హీరో కార్తికేయ, నటి జీవిత రాజశేఖర్‌, దర్శకుడు విజయ్‌ కనకమేడల, నిర్మాతలు బెక్కం వేణుగోపాల్‌, తిరుపతి రెడ్డి, రాధామోహన్‌, నటుడు సప్తగిరి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని