Sammathame: సతమతమూ ‘సమ్మతమే’.. అలరిస్తోన్న కిరణ్‌, చాందినీ జోడీ

‘రాజావారు రాణిగారు’తో కథానాయకుడిగా వెండితెరకు పరిచయమై ‘ఎస్‌ ఆర్‌ కళ్యాణమండపం’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు నటుడు కిరణ్‌ అబ్బవరం.

Published : 21 Oct 2021 16:12 IST

హైదరాబాద్‌: ‘రాజావారు రాణిగారు’తో కథానాయకుడిగా పరిచయమై ‘ఎస్‌.ఆర్‌. కళ్యాణమండపం’తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు నటుడు కిరణ్‌ అబ్బవరం. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న చిత్రం ‘సమ్మతమే’. గోపీనాథ్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కిరణ్‌కు జోడీగా ‘కలర్‌ ఫొటో’ ఫేమ్‌ చాందినీ చౌదరి నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోన్న ‘సమ్మతమే’ నుంచి ఫస్ట్‌ గ్లిమ్స్‌ను చిత్ర బృందం గురువారం సోషల్‌ మీడియా వేదికగా షేర్‌ చేసింది. యూత్‌ఫుల్‌ ప్రేమ కథా చిత్రంగా ఈ సినిమా సిద్ధం కానున్నట్లు తెలుస్తోంది. ‘కొత్త కొత్తగా ఉన్నది స్వర్గం ఇక్కడే అన్నది’, ‘అందంగా లేనా? అసలేం బాలేనా?’ అంటూ నటీనటుల మధ్య సాగే సంభాషణలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘సతమతమూ సమ్మతమే’ అంటూ సాగే నేపథ్య సంగీతం మెప్పిస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని