#Satyadev25: ‘సత్యదేవ్‌ 25వ సినిమా మొదలైంది

‘తిమ్మరుసు’తో ఇటీవల ప్రేక్షకుల్ని పలకరించిన యువ నటుడు సత్యదేవ్‌ కొత్త చిత్రం ఖరారు చేశారు. వి.వి. గోపాలకృష్ణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్నారు. ఈ సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.

Updated : 18 Aug 2021 20:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘తిమ్మరుసు’తో ఇటీవల ప్రేక్షకుల్ని పలకరించిన యువ నటుడు సత్యదేవ్‌ కొత్త చిత్రం మొదలైంది. వీవీ గోపాలకృష్ణ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమా బుధవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు క్లాప్‌నిచ్చారు. ప్రముఖ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ఛాన్‌ చేసి, గౌరవ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పిస్తున్నారు. అరుణాచల క్రియేషన్స్‌ పతాకంపై కొమ్మలపాటి కృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి, కూర్పు: నవీన్‌ నూలి. ఇతర నటీనటులు, టైటిల్‌ వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. సత్యదేవ్‌కి ఇది 25వ చిత్రం కావడం గమనార్హం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని