ఆ కళ్లన్నీ మనపైనే ఉంటాయి

‘‘మనం పెద్ద సినిమాలు చేస్తున్నామంటే? దానితో పాటు మిగతా వాళ్ల కళ్లన్నీ మనపైనే ఉంటాయని’’అంటోంది బాలీవుడ్‌ నటి వాణీ కపూర్‌. ప్రస్తుతం వాణీ కపూర్‌ ‘బెల్‌ బాటమ్‌’, ‘షమ్‌షేరా’ ‘చంఢీఘర్‌ కరే ఆషికి’లాంటి సినిమాల్లో నటిస్తోంది.

Published : 26 Mar 2021 01:02 IST

ముంబయి: ‘‘మనం పెద్ద సినిమాలు చేస్తున్నామంటే? దానితో పాటు మిగతా వాళ్ల కళ్లన్నీ మనపైనే ఉంటాయని’’అంటోంది బాలీవుడ్‌ నటి వాణీ కపూర్‌. ప్రస్తుతం వాణీ కపూర్‌ ‘బెల్‌ బాటమ్‌’, ‘షమ్‌షేరా’ ‘చండీగఢ్‌ కరే ఆషికి’లాంటి సినిమాల్లో నటిస్తోంది. తాజాగా ఆమె సినిమాల గురించి మాట్లాడుతూ..‘‘మనం పెద్ద సినిమాల్లో నటిస్తుండటం గొప్పగానే ఉంటుంది. అంతేకాదు దానితో పాటు మనపై అనేక కళ్లు ఉంటాయి. మనల్ని పరిశీలించేవాళ్లు కూడా అనేకమంది ఉంటారు. ఏ సినిమాలోనైనా నటించేటప్పుడు నా పాత్రలో వైవిధ్యం ఉండాలని కోరుకుంటా. నటనకు ఆస్కారం ఉండే పాత్రల్ని చేయాలని అనుకుంటాను. నేను నటిస్తోన్న ‘బెల్‌ బాటమ్‌’, షమ్‌షేరా’, ‘చండీగఢ్‌ కరే ఆషికి’ ప్రేక్షకుల్ని మెప్పిస్తాయని అనుకుంటున్నా. ’అని తెలిపింది. అక్షయ్‌ కుమార్‌తో కలిసి ‘బెల్‌ బాటమ్‌’, రణ్‌బీర్‌ కపూర్‌ సరసన ‘షమ్‌షేరా’, ఆయుష్మాన్‌ ఖురానాతో కలిసి ‘చండీగఢ్‌ కరే ఆషికి’ చిత్రాల్లో కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది మధ్యలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వాణీ కపూర్‌ తెలుగులో నానితో కలిసి ‘ఆహా కల్యాణం’ చిత్రంలో నటించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని