Venkatesh: చిరంజీవితో మల్టీస్టారర్‌ మొదలయ్యేది ఎప్పుడు?: విలేకరి ప్రశ్నకు వెంకటేశ్‌ ఏమన్నారంటే..?

‘సైంధవ్‌’ ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఇందులో పాల్గొన్న వెంకటేశ్‌ (Venkatesh) పలు విశేషాలు పంచుకున్నారు.

Published : 03 Jan 2024 15:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వెంకటేశ్‌ (Venkatesh) నటించిన 75వ చిత్రం ‘సైంధవ్‌’ (Saindhav). శైలేశ్ కొలను దర్శకుడు. తండ్రీ కుమార్తెల సెంటిమెంట్‌తో దీనిని తీర్చిదిద్దారు. శ్రద్ధా శ్రీనాథ్‌ కథానాయిక. బుధవారం ఈ సినిమా ట్రైలర్‌ విడుదల కార్యక్రమం హైదరాబాద్‌లో వేడుకగా జరిగింది. ఇందులో పాల్గొన్న చిత్రబృందం పలు ఆసక్తికర విశేషాలను పంచుకుంది.

‘‘అభిమానుల సమక్షంలో ‘సైంధవ్‌’ ట్రైలర్‌ విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఈ సినిమా తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. సంక్రాంతి రోజున విడుదల చేస్తున్నాం. ఎప్పటిలాగే మీ ఆదరణ ఉంటుందని ఆశిస్తున్నా. ఇలాంటి కథలో నటించడం ఆనందంగా ఉంది. ఇందులో నటించే ఛాన్స్‌ వచ్చినందుకు అదృష్టంగా భావిస్తున్నా. ఈ చిత్రం తప్పకుండా విభిన్నమైన అనుభూతిని అందిస్తుంది. ఎవరిని నిరాశకు గురి చేయదు’’ అని వెంకటేశ్‌ అన్నారు.

Guntur Kaaram: గుంటూరు కారం.. చివరి 45 నిమిషాలు అదిరిపోతుంది: నాగవంశీ

సెంటిమెంట్‌ + యాక్షన్‌ కలిసి ఉన్న ‘సైంధవ్‌’లో యాక్ట్‌ చేయడం ఎలా అనిపించింది?

వెంకటేశ్‌: ఇదొక పవర్‌ఫుల్‌ స్క్రిప్ట్‌. ప్రేక్షకుల మనసుని హత్తుకునే ఎమోషనల్‌ సీన్స్‌ ఇందులో మెండుగా ఉన్నాయి. అందరూ తప్పకుండా కర్చీఫ్‌లు సిద్ధం చేసుకోండి. అందులో ఎలాంటి సందేహం లేదు. అలాగే, ఈ సినిమాలో యాక్షన్‌ సీన్స్‌ కూడా కొత్తగా ఉంటాయి. ఎక్కడా బోర్‌ కొట్టవు.

మీ తనయుడు అర్జున్‌ సినీ ఎంట్రీ ఎప్పుడు?

వెంకటేశ్‌: అర్జున్‌ చదువుకుంటున్నాడు. అందరూ ముందు చదువుకోవాలి. సంతోషంగా ఉండాలి. తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం.

ఈ ఏడాది సంక్రాంతి పోటీ ఎలా ఉండనుంది? 

వెంకట్‌: మా సినిమా రిలీజ్‌ను వాయిదా వేయడం లేదు. అనుకున్న తేదీకి ప్రేక్షకులకు వినోదం అందించడానికి సిద్ధమయ్యాం.

ఈ కథ రియాలిటీకి దగ్గరగా ఉంటుందా?

శైలేశ్‌: spinal muscular atrophy అనేది దేశంలో ఒక పెద్ద సమస్యగా మారింది. అవయవాలు పాడైపోయి ఎంతోమంది పిల్లలు మృతి చెందుతున్నారు. చిన్న వయసులోనే జీన్‌ ట్రీట్‌మెంట్‌ చేస్తే బతికే అవకాశం ఉంటుంది. ఈ ట్రీట్‌మెంట్‌కు సంబంధించిన ఇంజెక్షన్‌ ధర దాదాపు రూ.17 కోట్లు. కొవిడ్‌ సమయంలో ఓ వ్యక్తి వల్ల దీని గురించి నేను తెలుసుకున్నా. ఎంతో రీసెర్చ్‌ చేసి ‘సైంధవ్‌’ చిత్రాన్ని తెరకెక్కించా.

పిల్లలను ఇబ్బందిపెట్టే సన్నివేశాలు ఉంటాయా?

వెంకటేశ్‌: లేదు. సినిమాకు ఎంత వరకూ యాక్షన్‌ సీన్స్‌ అవసరమో అంత వరకూ చూపించాం.

త్రివిక్రమ్‌తో సినిమా మళ్లీ ఎప్పుడు ఉంటుంది?

వెంకటేశ్‌: ఆయనకు ఫోన్‌ చేయండి. అందరూ అదే విషయం అడుగుతున్నారు.

చిరంజీవితో మల్టీ స్టారర్‌ ఎప్పుడు మొదలవుతుంది

వెంకటేశ్‌: మంచి కథలు వస్తే తప్పకుండా కలిసి వర్క్‌ చేస్తాం.

12న మహేశ్‌బాబు సినిమా.. 13న మీ చిత్రం విడుదలవుతోంది కదా. మీ ఫీలింగ్‌ ఏమిటి? 

వెంకటేశ్‌: సూపర్‌ ఫీలింగ్‌. ప్రేక్షకులు మా సినిమాలు చూడటానికి ఆసక్తిగా ఉన్నారు. నా బ్రదర్‌కు ఆల్‌ ది బెస్ట్‌.

థియేటర్స్‌ విషయంలోనూ చర్చ జరుగుతుంది. గుంటూరు కారం చిత్రానికి ఎక్కువ థియేటర్స్‌ ఇస్తున్నారని టాక్‌?

వెంకటేశ్‌: అందుకు నేను ఏమీ ఫీల్‌ కాను. మాకు వచ్చిన థియేటర్స్‌ తీసుకుంటాం. అందరూ బాగుండాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని