Vimanam: భావోద్వేగాలతో బరువెక్కించే ‘విమానం’
ఓ పేద కుటుంబంలో ఉండే పిల్లాడికి విమానం ఎక్కాలనే కోరిక పుడుతుంది. అవిటితనంతో బాధపడుతున్న అతని తండ్రి కొడుకు కోరిక తీర్చాలని రాత్రి పగలు కష్టపడుతుంటాడు.
ఓ పేద కుటుంబంలో ఉండే పిల్లాడికి విమానం ఎక్కాలనే కోరిక పుడుతుంది. అవిటితనంతో బాధపడుతున్న అతని తండ్రి కొడుకు కోరిక తీర్చాలని రాత్రి పగలు కష్టపడుతుంటాడు. అదే బస్తీలో ఉండే కోటికి సుమతి అంటే ప్రాణం. లోకమంతా ఆమెను కామంతో చూస్తున్నా.. అతను మాత్రం మనస్ఫూర్తిగా ఆరాధిస్తుంటాడు. మరి ఈ భిన్న వ్యక్తుల ప్రయాణాలు ఏ తీరానికి చేరాయో తెలుసుకోవాలంటే ‘విమానం’ (Vimanam) చూడాల్సిందే. సముద్రఖని, అనసూయ, మాస్టర్ ధ్రువన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమిది. శివ ప్రసాద్ యానాల తెరకెక్కించారు. జీ స్టూడియోస్ సంస్థతో కలిసి కిరణ్ కొర్రపాటి నిర్మించారు. మీరా జాస్మిన్, రాహుల్ రామకృష్ణ, ధనరాజ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్ 9న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే నటి అనుపమ పరమేశ్వరన్ గురువారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ప్రచార చిత్రాన్ని తీర్చిదిద్దిన తీరును బట్టి.. ఇదొక భావోద్వేభరితమైన చిత్రమని అర్థమవుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Hyderabad: కూలిన రెండంతస్తుల భవనం స్లాబ్.. ఇద్దరు కార్మికులు మృతి
-
Tirumala: తిరుమలలో వేడుకగా బంగారు గొడుగు ఉత్సవం
-
Social Look: విజయ్ దేవరకొండ ఐస్ బాత్.. మీనాక్షి స్టన్నింగ్ లుక్.. ఐశ్వర్య బ్రైడల్ పోజ్
-
Game Changer: అందుకే షూటింగ్ వాయిదా.. రూమర్స్‌పై ‘గేమ్ ఛేంజర్’ టీమ్
-
TOEFL: విదేశాల్లో సెకండరీ ఎడ్యుకేషన్‌పై.. భారతీయుల మొగ్గు!
-
India vs Australia: ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్నారు.. కంగారూల ఎదుట భారీ లక్ష్యం