ఉల్లాసంగా.. ఉత్సాహంగా.. జీఎంసీ 1978 బ్యాచ్‌ రీయూనియన్‌ మీట్‌

‘ఆనాటి ఆ స్నేహం.. ఆనంద గీతం’ అంటూ వైద్యులంతా చిన్నపిల్లల్లా మారిపోయారు. అలనాటి జ్ఞాపకాల్లోకి వెళ్లి చదువుకున్న రోజుల్లో చేసిన అల్లరి, కొంటె పనులు, సరదాలు గుర్తుకు తెచ్చుకుని సందడి చేశారు.

Updated : 17 Oct 2023 12:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఆనాటి ఆ స్నేహం.. ఆనంద గీతం’ అంటూ వైద్యులంతా చిన్నపిల్లల్లా మారిపోయారు. అలనాటి జ్ఞాపకాల్లోకి వెళ్లి చదువుకున్న రోజుల్లో చేసిన అల్లరి, కొంటె పనులు, సరదాలు గుర్తుకు తెచ్చుకుని సందడి చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు అమెరికా, యూకే సహా పలు దేశాల్లో స్థిరపడిన 1978 బ్యాచ్ గుంటూరు వైద్య కళాశాల విద్యార్థులంతా ఒకేచోట కలిసి సందడి చేశారు. వైద్య కళాశాలలో చేరి 45 ఏళ్లు అయిన సందర్భంగా అక్టోబర్‌ 13, 14, 15 తేదీల్లో విశాఖలోని సన్‌రే రిసార్ట్స్‌లో నిర్వహించిన ఈ ఆత్మీయ వేడుకలో వైద్యులంతా ఎంతో సందడిగా గడిపారు. ఈ మధురస్మృతులన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా సెల్ఫీలు తీసుకుంటూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.

తొలిరోజు కార్యక్రమానికి సినీ గేయ రచయిత భువన చంద్ర ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గాయకులు మల్లికార్జున్‌, ఆకునూరి శారద సమక్షంలో 50 స్నేహగీతాల పాటల పెన్‌డ్రైవ్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా 1970, 1980, 1990 లోని సినీ పాటలను దాదాపు మూడు గంటల పాటు ఆలపించగా.. వైద్యులంతా మైమరిచిపోయారు. రెండో రోజు ఈవెంట్‌కు సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన జీఎంసీ రీయూనియన్‌ పుస్తకాన్ని విడుదల చేశారు. అలాగే,  పలు స్కిట్‌లను వైద్యులే రూపకల్పన చేసి ప్రత్యక్షంగా తమ నటనా కౌశలాన్ని ప్రదర్శించడం ద్వారా అందరినీ ఆందనపరిచారు. 

‘ఓపెన్‌ హార్ట్‌ విత్‌ ఆర్కే’ స్కిట్‌ను డాక్టర్‌ రమణకుమార్‌, డాక్టర్‌ దినకర్‌ ప్రదర్శించగా..  కొవిడోపాఖ్యానం స్కిట్‌లో డాక్టర్‌ విజయ, డాక్టర్‌ నగేష్‌, డాక్టర్‌ దినకర్‌, డాక్టర్‌ రాకేశ్, డాక్టర్‌ కృష్ణ కుమార్‌, డాక్టర్‌ గౌరీశంకర్‌, డాక్టర్‌ భాను ప్రకాశ్‌, డాక్టర్‌ కేవీఎల్‌ నరసింహమూర్తి, డాక్టర్‌ వీరెన్‌, డాక్టర్‌ సునీత, డాక్టర్‌ శ్యామల, డాక్టర్‌ సుధ, డాక్టర్‌ మీనాక్షి పాల్గొన్నారు. ఈ స్కిట్‌ను డాక్టర్‌ సునీత రాసి డైరెక్ట్‌ చేశారు.  అలాగే, ప్రస్తుతం సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌, వైద్య విద్య అదనపు డైరెక్టర్‌గా ఉన్నడాక్టర్‌ సుధాకర్‌, వైకాపా మాజీ రాష్ట్ర యూత్‌ సెక్రటరీ డాక్టర్‌ అమృతపాణి పలు స్కిట్‌లను ప్రదర్శించి సందడి చేశారు. ఈగల్‌ క్లీనిక్‌ అనే స్కిట్‌లో డాక్టర్‌ ఇందిర, సుజాత, కె.మోహిని, ఆదిలక్ష్మి, వెంకట లక్ష్మి, డాక్టర్‌ సుధా, డాక్టర్‌ చిరంజీవి, డాక్టర్‌ శ్యామల, డాక్టర్‌ గౌరీ శంకర్‌, డాక్టర్‌ కేవీఎల్‌ఎన్‌ నటించి సందడిచేశారు. ఈ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో డాక్టర్‌ రాజశేఖర్‌, డాక్టర్‌ ప్రమీల, ఎస్‌. సుజాత ఈల పాటలు ఆలపించి సందడి చేశారు.  గుంటూరు వైద్య కళాశాల 1978 బ్యాచ్‌ ఏర్పాటు, కొనసాగిస్తున్న కార్యకలాపాలను డాక్టర్‌ వేణుగోపాల్‌ క్లుప్తంగా వివరించారు. డాక్టర్‌ యాస్మిన్‌, డాక్టర్‌ విజయ నృత్యం చేసి అందరినీ అలరించారు. మొత్తంగా మూడు రోజుల పాటు కొనసాగిన ఈ కార్యక్రమంలో వైద్యులంతా చిన్న పిల్లల్లా ఆనందంగా గడిపారు. తమ సహ విద్యార్థులందరికీ మరిచిపోలేని తీపి జ్ఞాపకాలను పంచారు. ఈ కార్యక్రమానికి సన్‌రే రిసార్ట్స్‌ ఛైర్మన్‌ రాజాబాబు లాజిస్టిక్స్‌ విషయంలో సహకారం అందించగా.. ఈ అద్భుతమైన క్షణాలను ఫొటోలు తీసి శివ మల్లాల సహాయపడినట్టు వైద్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని