TANA: తానా ఆధ్వర్యంలో సౌతెర్న్ న్యూ హాంప్‌షైర్‌ యూనివర్సిటీ విద్యార్థులకు రిఫ్రెష్‌ వర్క్‌షాప్‌

సౌతెర్న్‌ న్యూ హాంప్‌షైర్‌ యూనివర్సిటీకి కొత్తగా వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల ప్రయోజనం కోసం తానా న్యూ ఇంగ్లాండ్‌ ఛాప్టర్‌ ‘తానా రిఫ్రెష్‌ వర్క్‌షాప్‌’ను నిర్వహించింది.

Updated : 09 May 2024 07:06 IST

అమెరికా: సౌతెర్న్‌ న్యూ హాంప్‌షైర్‌ యూనివర్సిటీకి కొత్తగా వస్తున్న అంతర్జాతీయ విద్యార్థుల ప్రయోజనం కోసం తానా న్యూ ఇంగ్లాండ్‌ ఛాప్టర్‌ ‘తానా రిఫ్రెష్‌ వర్క్‌షాప్‌’ను నిర్వహించింది. తానా అధ్యక్షుడు నిరంజన్‌ శృంగవరపు, ఫౌండేషన్‌ ఛైర్మన్‌ శశికాంత్‌ వల్లేపల్లి ప్రోత్సాహంతో తానా న్యూ ఇంగ్లాండ్‌ ప్రాంతీయ ప్రతినిధి సోంపల్లి కృష్ణ ప్రసాద్‌ ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 

అమెరికాలో హృదయాలను కలిచివేసే సంఘటలను ఇక్కడికి వచ్చిన విద్యార్థులు గమనిస్తుంటారు. ఆ సంఘటనలను చూస్తున్నా, వింటున్నా ఇక్కడికి వచ్చిన విద్యార్థులు ఆందోళనకు గురవుతారు. ఈ నేపథ్యంలో ‘తానా రిఫ్రెష్ వర్క్‌షాప్’ విద్యార్థులపై చాలా ప్రభావం చూపుతుందని నిర్వాహకులు తెలిపారు. ఎన్నో కలలతో వేల కిలోమీటర్ల దూరం నుంచి ఇక్కడికి వచ్చే విద్యార్థులు.. తమకు వీసా రాగానే జీవితం సెటిల్ అయిందనే భావంతో ఉంటారని, అయితే అలాంటి విద్యార్థులకు ఇక్కడి పరిస్థితులపై అవగాహన చాలా అవసరమన్నారు. అమెరికాకు వచ్చే విద్యార్థులు ముందుగానే ఇక్కడి నియమాలు, నిబంధనలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

విశ్వవిద్యాలయ ఓరియెంటేషన్ ప్రాముఖ్యత, ప్రొఫెసర్లు, తోటి విద్యార్థులతో ప్రవర్తన, జాగ్రత్తలు విశదీకరించారు. ఇక్కడి ప్రభుత్వం ఎలా పని చేస్తుంది, ఏదైనా అనుకోని సంఘటన జరిగితే ఏం చేయాలి, విద్యార్థుల హక్కులు, వాటి ప్రాముఖ్యత, ఆరోగ్య సమస్యలు వస్తే ఏం చేయాలి ఇలా పలువిషయాలను విడమర్చి చెప్పారు. సోషల్ మీడియా ప్రపంచంలో మునిగిపోకుండా, అందరితో సామరస్యంగా ఎలా ఉండాలి, ఎవరికైనా ఏదైనా సంఘటన తలెత్తితే, అవాంతర పరిస్థితి ఎదురైతే వెంటనే ఏం చేయాలి? ఏదైనా చట్టపరమైన సమస్య వస్తే ఎలా ఎదుర్కోవాలి? వాటి గురించి చెప్పారు. విద్యార్థులు తమ తల్లిదండ్రులతో క్రమం తప్పకుండా మాట్లాడాలని సూచించారు. 

ఈ కార్యక్రమంలో శశాంక్ గుట్టు, అభిషేక్ ప్రగాఢ, మహేష్‌ కోయలమూడి, గౌతమ్ గోరంట్ల, భరత్ రెడ్డి,  చైతన్య గుడివాడ, ఆదిత్య కోడి, దినేష్ గుంటుపల్లి, హేమ శ్రీ ముద్దం తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని