ఎన్నారై తెదేపా ఆధ్వర్యంలో కువైట్‌లో ఎన్నికల ప్రచారం

ఎన్నారై తెదేపా కువైట్‌ ఆధ్వర్యంలో తెదేపా-జనసేన-భాజపా కూటమికి మద్దతుగా విస్త్రృత ప్రచారం నిర్వహించారు.

Published : 05 May 2024 16:11 IST

కువైట్: ఎన్నారై తెదేపా కువైట్‌ ఆధ్వర్యంలో తెదేపా-జనసేన-భాజపా కూటమికి మద్దతుగా విస్త్రృత ప్రచారం నిర్వహించారు. తెదేపా గల్ఫ్ ఎంపవర్మెంట్‌ కో-ఆర్డినేటర్‌ కుదరవల్లి సుధాకర రావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు షేక్‌ బాషా, అద్దేపల్లి చిన్నరాజు, కుటుంబరావు, కోడూరు రమేశ్‌ గౌడ్‌, గుణపాటి చిన్నబాబు, హరికృష్ణ తదితరులు కువైట్‌లోని వివిధ పార్కులకు వచ్చిన తెలుగువారిని కలిసి ఉమ్మడి మ్యానిఫెస్టోలో పేర్కొన్న పథకాలను వివరించారు. కూటమి అభ్యర్థులకు ఓటు వేసేలా భారత్‌లో ఉంటున్న వారి కుటుంబ సభ్యులు, స్నేహితులకు అవగాహన కల్పించాలని కోరారు.

కువైట్‌లోని వివిధ సంస్థల్లో పని చేస్తున్న పలువురు ఉద్యోగులను కుదరవల్లి సుధాకరరావు కలిశారు. వారికి ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయ పరిస్థితిని వివరిస్తూ, చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే ప్రజల ఆస్తులకు రక్షణ ఉంటుందని, రాష్ట్రానికి రాజధాని ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి, మద్యం, ఇసుక మాఫియాలు రాజ్యమేలుతున్నాయని, వాటి నుంచి బయటపడాలంటే చంద్రబాబు సీఎం కావాలని వివరించారు. ఎన్నికల రోజు ( మే 13) వరకూ కువైట్‌లో తెలుగు ప్రజలు అధికంగా నివసించే ప్రాంతాల్లో పర్యటిస్తామని ఈ సందర్భంగా సుధాకర్‌రావు పేర్కొన్నారు. ఏపీలో ఉండే వారి బంధువులు, స్నేహితులకు అవగాహన కల్పించేందుకు తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ మేరకు ప్రణాళికలను సిద్ధం చేసుకున్నట్లు చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని