తెలంగాణ భాజపా కార్యాలయంలో సంబురాలు

దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు 1470 ఓట్లతో సమీప ప్రత్యర్థి,

Updated : 10 Nov 2020 18:11 IST

హైదరాబాద్‌: దుబ్బాక ఉప ఎన్నికలో భాజపా విజయదుందుభి మోగించింది. ఆ పార్టీ అభ్యర్థి రఘునందన్‌రావు 1470 ఓట్లతో సమీప ప్రత్యర్థి, తెరాస అభ్యర్థి సోలిపేట సుజాతపై విజయం సాధించారు. దీంతో హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో సంబురాలు మొదలయ్యాయి. కార్యకర్తలంతా బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను భుజాలపై మోసుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా భాజపా శ్రేణులు సంబరాలు జరుపుకొంటున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మంతో పాటు కొత్తగూడెం, మణుగూరు, వైరా, ఇల్లందులో కార్యకర్తలు టపాసులు కాల్చి పరస్పరం మిఠాయిలు పంచుకున్నారు. ఖమ్మం, కొత్తగూడెంలో భాజపా శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించాయి.

దుబ్బాక ఉపఎన్నిక గెలుపు సాధారణ విజయం కాదని భాజపా సీనియర్‌ నేత మురళీధర్‌రావు అన్నారు. తెరాస కండబలం, ధనబలాన్ని ప్రజలు వ్యతిరేకించారన్నారు. దుబ్బాక నుంచి భాజపా ఘంటారావం పూరించిందని పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కె.అరుణ అన్నారు. తెరాస నియంతృత్వ పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారని, దీనికి తాజా ఫలితాలే నిదర్శనమని ఆమె అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు