సీఎం సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ లేదు

ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కొరవడిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ...

Updated : 09 Dec 2020 11:55 IST

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

అమరావతి: ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సొంత ఊరిలోనే మహిళలకు రక్షణ కొరవడిందని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. పులివెందుల నియోజకవర్గం పెద్దకుడాల గ్రామంలో ఎస్సీ మహిళపై అత్యాచారం, అతి కిరాతకంగా హత్య చేయటాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. విషయం బయటకి రాకుండా చేసేందుకు ప్రభుత్వం పెడుతున్న శ్రద్ధ మహిళలకు రక్షణ కల్పించే విషయంలో పెట్టాలని హితవు పలికారు. ఘటనపై త్వరితగతిన విచారణ జరిపి బాధ్యుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వంలో చలనం లేదని మండిపడ్డారు. చట్టాల పేరుతో కాలయాపన తప్ప మృగాళ్లను శిక్షించింది లేదన్న లోకేశ్.. రాష్ట్రంలో వరుస అత్యాచార ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయని అన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని