అసదుద్దీన్‌ ఒవైసీకి నిరసన సెగ

జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి నిరస సెగ తగిలింది.

Published : 23 Nov 2020 11:12 IST

హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీకి నిరస సెగ తగిలింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన వరద సహాయం తమకు అందలేదని ఒవైసీని మహిళలు నిలదీశారు. జాంబాగ్‌ డివిజన్‌ ఎంఐఎం అభ్యర్థికి మద్దతుగా ఒవైసీ సోమవారం ఉదయం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టకాలంలో ఉన్నప్పుడు పట్టించుకోకుండా ఎన్నికల సమయంలో ఎలా ఓట్లు అడుగుతారని నిలదీశారు. దీంతో వారికి సమాధానం చెప్పకుండానే ఒవైసీ అక్కడి నుంచి వెనుదిరిగారు. గ్రేటర్‌ ఎన్నికల్లో తమ పార్టీని గెలిపించాలంటూ ఓట్లు అభ్యర్థించారు. గ్రేటర్‌ పోరులో ఇతర పార్టీలతో ఎలాంటి పొత్తు లేకుండా 52 స్థానాల్లో ఎంఐఎం పోటీ చేస్తున్నట్లు అసదుద్దీన్‌ స్పష్టం చేశారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని