అధికారులతో ఎస్‌ఈసీ వీడియోకాన్ఫరెన్స్‌

ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ బుధవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ

Published : 26 Jan 2021 00:13 IST

అమరావతి: ఏపీలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల సంఘం కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌ బుధవారం ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. కలెక్టర్లు, ఎస్పీలతో ఈ సమావేశం ఉండనుంది. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఏపీ సీఎస్‌, డీజీపీ పాల్గొననున్నారు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించవల్సిందేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో ఎన్నికల ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో ఎస్‌ఈసీ చర్చలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా ఎన్నికల అంశాలపై కలెక్టర్లు, ఎస్పీలకు ఎస్‌ఈసీ దిశానిర్దేశం చేయనున్నారు. నామినేషన్లకు ఏర్పాట్లు, ఓటర్ల జాబితా రూపకల్పన, ఎన్నికల్లో భద్రతా అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు. ఎన్నికలు సజావుగా జరిగిలా చేపట్టే చర్యలపై ఆదేశాలు ఇవ్వనున్నారు. 

ఎన్నికలకు నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంకాని నేపథ్యంలో గతంలో విడుదల చేసిన షెడ్యూల్‌లో ఎన్నికల సంఘం మార్పులు చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం రెండో దశను మొదటి దశగా, మూడో దశను రెండో దశగా, నాలుగో దశను మూడో దశగా, మొదటి దశను నాలుగో దశగా మార్చింది. గత షెడ్యూల్‌ ప్రకారం ఫిబ్రవరి 5, 9, 13, 17 తేదీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా.. తాజాగా దానిలో మార్పులు చేస్తూ ఫిబ్రవరి 9, 13, 17, 21 తేదీల్లో పోలింగ్‌ నిర్వహించనున్నట్లు వెల్లడించింది. మొదటి దశకు ఈనెల 29 నుంచి, రెండో దశకు ఫిబ్రవరి 2, మూడో దశకు 6, నాలుగో దశకు 10 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపింది. 

ఇవీ చదవండి..

సుప్రీం తీర్పు: ఎస్‌ఈసీకి ఏపీ ప్రభుత్వ సహకారం
ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం

 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని