Updated : 25 May 2022 21:10 IST

Andhra News: ఆత్మకూరు ఉప ఎన్నికకు షెడ్యూల్‌ విడుదల

దిల్లీ: నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) షెడ్యూల్‌ విడుదల చేసింది. మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో జూన్‌ 23న పోలింగ్‌ జరపాలని నిర్ణయించింది. దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న మూడు లోక్‌సభ స్థానాలు, ఏడు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించేందుకు బుధవారం రాత్రి ఈసీ షెడ్యూల్‌ను విడుదల చేసింది.

ముఖ్యమైన తేదీలు:

  • ఉప ఎన్నికలకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల: మే 30
  • నామినేషన్లకు తుది గడువు: జూన్‌ 6
  • నామినేషన్ల పరిశీలన: జూన్‌ 7
  • నామినేషన్ల ఉపసంహరణ గడువు: జూన్‌ 9
  • పోలింగ్‌ తేదీ: జూన్‌ 23
  • ఓట్ల లెక్కింపు: జూన్‌ 26

ఉప ఎన్నికలు జరిగే లోక్‌సభ/ అసెంబ్లీ స్థానాలివే..

సంగ్రూర్‌ (పంజాబ్‌), రాంపూర్‌, అజంగఢ్‌ (యూపీ) పార్లమెంట్‌ స్థానాలతో పాటు అగర్తలా, టౌన్‌ బోర్డోవలి, సుర్మా, జుబరాజ్‌నగర్‌ (త్రిపుర), ఆత్మకూరు (ఏపీ), రాజిందర్‌నగర్‌ (దిల్లీ), మందర్‌ (ఝార్ఖండ్‌) అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి.

ఆ రాష్ట్రాల్లో 30 ఎమ్మెల్సీ స్థానాలకూ ఎన్నికలు..

వీటితో పాటు ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్‌లలో త్వరలో ఖాళీ అవుతున్న 30ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు కూడా ఈసీ షెడ్యూల్‌ను ప్రకటించింది. జులై 6 నాటికి యూపీలో సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు 13 మంది సభ్యుల పదవీ కాలం ముగియనుండగా.. మహారాష్ట్రలో జులై 7 కల్లా 10 మంది ఎమ్మెల్సీలు, బిహార్‌లో ఏడుగురి పదవీ కాలం జులై 21 నాటితో ముగినుంది. ఖాళీ కాబోతున్న ఈ 30 స్థానాలకు జూన్‌ 20న ఎన్నికలు నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది. 

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని