Telangana News: కాంగ్రెస్ పార్టీతోనే రాజ్యాంగ పరిరక్షణ: భట్టి విక్రమార్క
కాంగ్రెస్ పార్టీతోనే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
హైదరాబాద్: రాజ్యాంగం మూల సిద్ధాంతమే.. కాంగ్రెస్ మూల సిద్ధాంతమని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. దేశంలో కాంగ్రెస్‌తోనే రాజ్యాంగ పరిరక్షణ సాధ్యమని తెలిపారు. రాజ్యాంగాన్ని అందించడంలో కృషి చేసిన కాంగ్రెస్ పట్ల నిబద్ధతతో ఉండాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో భాజపా, తెరాస రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తున్నాయని మండిపడ్డారు. ప్రధాని మోదీ రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు. దేశ ప్రజల భావప్రకటన స్వేచ్ఛను మోదీ సర్కార్ హరిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చి మనుశాస్త్రాన్ని అమలు చేయాలని భాజపా చూస్తోందని విమర్శించారు. దేశంలో ఆర్థిక అసమానతలను భాజపా పెంచి పోషిస్తోందని, ఒకరిద్దరు కార్పొరేట్లకే దేశ సంపదను దోచిపెడుతోందని దుయ్యబట్టారు. భాజపా అరాచకాలను కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న భాజపా, తెరాస కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రాజ్యాంగాన్ని పరిరక్షిద్దామంటూ కాంగ్రెస్ శ్రేణులతో ఈ సందర్భంగా భట్టి ప్రమాణం చేయించారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Nara Lokesh-yuvagalam: లోకేశ్ బహిరంగసభను అడ్డుకున్న పోలీసులు.. బంగారుపాళ్యంలో ఉద్రిక్తత
-
Movies News
Samantha: ఎనిమిది నెలలు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొన్నా: సమంత
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
General News
ICAI CA exam results: సీఏ ఫౌండేషన్ పరీక్ష ఫలితాల కోసం క్లిక్ చేయండి
-
Politics News
TS Assembly: బడ్జెట్ సమావేశాలపై బీఏసీలో చర్చ.. 25 రోజుల పాటు నిర్వహించాలన్న భట్టి
-
Sports News
Team India: టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్ ‘ఓవర్’ హీరో.. క్రికెట్కు వీడ్కోలు