విశాఖ ఉక్కుపై ఏపీ సర్కార్‌కి చిత్తశుద్ధి ఎక్కడుంది? 

విశాఖ ఉక్కు పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని భాజపా ఆరోపించింది. 2017-19 మధ్య విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఆరు ....

Updated : 07 Feb 2021 07:31 IST

భాజపా నేత సత్యకుమార్‌ ప్రశ్న

తిరుపతి: విశాఖ ఉక్కు పరిశ్రమపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదని భాజపా ఆరోపించింది. 2017-19 మధ్య విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై ఆరు సమావేశాలు జరిగితే.. రాష్ట్రం నుంచి ఒక్క ప్రతినిధి కూడా హాజరుకాలేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తుశుద్ధి ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. తిరుపతి నగరంలో కేంద్ర బడ్జెట్‌పై భాజపా ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర భాజపా నేతలు కూడా ఉన్నారు.  

ఇలాంటి బడ్జెట్‌ 25ఏళ్లలో నేను చూడలేదు..
ఈ సదస్సుకు భాజపా ఎంపీ సురేశ్‌ ప్రభు కూడా హాజరయ్యారు. పాతికేళ్లలో ఇలాంటి బడ్జెట్‌ చూడలేదన్నారు. అభివృద్ధి చెందిన దేశాలూ వ్యాక్సిన్‌ కోసం మనపై ఆధారపడ్డాయన్నారు. ఆర్థిక లావాదేవీలన్నీ ఇక్కడే ప్రారంభమై, ఇక్కడే కార్యరూపం దాల్చేలా బడ్జెట్‌ ఉందన్నారు. తెలుగు వాళ్లు విదేశాల్లో రాణిస్తున్నా ఏపీలో ఎందుకు రాణించడంలేదు? అలాంటి పరిస్థితులు మార్చేలా కేంద్ర బడ్జెట్‌ ఉందని వ్యాఖ్యానించారు. అంకుర సంస్థలను ప్రోత్సహించేలా బడ్జెట్‌లో కేటాయింపులు ఉన్నాయన్నారు. నిధుల కేటాయింపులో ఏపీపై వివక్ష అనేది అవాస్తవమని చెప్పారు. ఏపీలోని రైల్వే ప్రాజెక్టులకు గతంలో కంటే ఎక్కువ నిధులిచ్చినట్టు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని