Andhra News: విశాఖను పాలనా రాజధానిగా ప్రకటించాల్సిందే: మంత్రి బొత్స
ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా విశాఖను రాజధానిగా ప్రకటించాలని సీఎం జగన్‌ను కోరుతున్నట్టు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.
విజయనగరం: విశాఖను రాజధానిగా వద్దనే వాళ్లకు ఉత్తరాంధ్రలో పర్యటించే హక్కు లేదని ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా వైకాపా విస్తృత స్థాయి సమావేశం అధ్యక్షుడు పరీక్షిత్ రాజు అధ్యక్షతన శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి బొత్స మాట్లాడుతూ.. మూడు ముక్కలాట అంటూ విమర్శలు చేస్తున్న చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే విశాఖను పరిపాలన రాజధాని చేసి తీరాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంతంలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడాలంటే విశాఖ పరిపాలన రాజధానితోనే సాధ్యమన్నారు.
ఒక్క రోజు కూడా ఆలస్యం చేయకుండా వీలైనంత త్వరగా విశాఖను రాజధానిగా ప్రకటించాలని సీఎంను కోరుతున్నట్టు చెప్పారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రతి ఇల్లు తలుపుతట్టి బాగోగులు తెలుసుకుంటున్నామని, గతంలో ఆ పరిస్థితి లేదన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చబట్టే ఇంటింటికీ వెళ్లగలుగుతున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపా విజయం తథ్యమని జోస్యం చెప్పారు. కిందిస్థాయి కార్యకర్త నుంచి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని డిప్యూటీ సీఎం, గిరిజన శాఖ మంత్రి రాజన్నదొర అన్నారు. ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, జోగారావు, వైకాపా నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrayaan-3: ప్రజ్ఞాన్ రోవర్ మేల్కోకపోయినా ఇబ్బందేం లేదు: సోమనాథ్
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime: డబ్బు కోసం దారుణ హత్య.. తీరా చూస్తే..!
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!
-
Team India: కప్పు ముందు కనువిప్పు.. టీమ్ఇండియాకు ఓటమి నేర్పే పాఠాలెన్నో