BRS-BSP: భారాసతో పొత్తు.. బీఎస్పీకి రెండు ఎంపీ సీట్లు

లోక్‌సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి (భారాస), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు జరిగింది.

Updated : 15 Mar 2024 11:35 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి (భారాస), బహుజన్‌ సమాజ్‌ పార్టీ (బీఎస్పీ) మధ్య పొత్తు ఖరారైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీట్ల కేటాయింపు జరిగింది. బీఎస్పీకి 2 ఎంపీ సీట్లను కేటాయిస్తూ భారాస నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్‌, నాగర్‌ కర్నూల్‌ స్థానాలను వారికి ఇచ్చింది. నాగర్‌కర్నూల్‌లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ పోటీ చేయనున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. బీఎస్పీకి 2 కేటాయించడంతో మిగిలిన 15 చోట్ల భారాస పోటీ చేయనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని