Congress-CPI: కాంగ్రెస్‌-సీపీఐ పొత్తు.. చర్చలు కొనసాగుతున్నాయ్‌: చాడ వెంకట్‌రెడ్డి

కాంగ్రెస్‌తో పొత్తుల అంశంపై జాతీయ స్థాయి నాయకత్వం చర్చలు జరుపుతోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి తెలిపారు.

Published : 23 Sep 2023 18:58 IST

హైదరాబాద్‌: తెలంగాణలో కాంగ్రెస్ (Congress), సీపీఐ (CPI) మధ్య పొత్తు అంశంపై జాతీయ నాయకత్వం చర్చలు జరుపుతోందని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి (Chada Venkat Reddy) తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కమ్యూనిస్టులకు గౌరవం లేకపోతే, ప్రజలకు గౌరవం లేనట్టేనని అన్నారు. పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లును భాజపా ఎన్నికల ప్రచార అస్త్రంగా మార్చుకుందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో సీపీఐ బలంగా ఉందని, ప్రాబల్యం ఎక్కువగా ఉన్న స్థానాల్లో సీపీఐ తప్పకుండా పోటీ చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజా ఉద్యమాల చరిత్ర సీపీఐకి ఉందని, హుస్నాబాద్‌లో ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర తమదని గుర్తు చేశారు. అక్కడ కచ్చితంగా బరిలోకి దిగుతామని అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు