Chandrababu arrest: చంద్రబాబు అరెస్ట్‌.. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు: పురందేశ్వరి

తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును భాజపా ఖండించింది. సరైన నోటీసు ఇవ్వకుండా ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు.

Updated : 09 Sep 2023 09:52 IST

అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబునాయుడు అరెస్టును భాజపా ఖండించింది. సరైన నోటీసు ఇవ్వకుండా ఆయన్ని అదుపులోకి తీసుకున్నారని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. ఎఫ్‌ఐఆర్‌లో ఆయన పేరు కూడా పేర్కొనలేదని తెలిపారు. కనీసం ఆయన నుంచి వివరణ కూడా తీసుకోలేదన్నారు. అరెస్టు సమయంలో సరైన విధానాలూ పాటించలేదని పేర్కొన్నారు.

మాజీ ముఖ్యమంత్రి, తెదేపా జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడును పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి ఆయన అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. వైద్యపరీక్షలు నిర్వహించి ఆయనను కాన్వాయ్‌లోనే ఎన్‌ఎస్‌జీ భద్రతతో విజయవాడకు తరలిస్తామని పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని