Chandrababu: రాష్ట్రంలో ఒక్కో కుటుంబంపై ఏడాదికి రూ.లక్ష అప్పుల భారం: చంద్రబాబు

గతంలో సంతోషంగా, సంక్షేమంగా సాగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయాణం ఇప్పుడు సంక్షోభం దిశగా పయనిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 05 Apr 2022 18:29 IST

అమరావతి: గతంలో సంతోషంగా, సంక్షేమంగా సాగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రయాణం ఇప్పుడు సంక్షోభం దిశగా పయనిస్తోందని తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. చెత్త పన్నులు, పెరిగిన విద్యుత్‌ ఛార్జీలు, భగ్గుమంటున్న నిత్యావసర వస్తువుల ధరలతో ప్రజల జేబులు గుల్లవుతున్నాయన్నారు. ఇసుక, మద్యం వంటి వాటితో జరిగే దోపిడీ సరే సరి అని ధ్వజమెత్తారు. వైకాపా సర్కారు బాదుడే బాదుడు విధానంతో రాష్ట్ర ప్రజలు విలవిల్లాడుతున్నారని ఆక్షేపించారు. ఒక్కో కుటుంబంపై ఏడాదికి రూ.లక్షకుపైగా అప్పుల భారం పడుతోందని మండిపడ్డారు. ప్రజల కష్టార్జితాన్ని పిండుకుని... తాను దర్జాగా దండుకుంటున్న జగన్‌ పాలనపై పోరాడాలన్నారు. అప్పులు చేస్తూ.. వాటి కోసం ప్రజల జేబులు ఖాళీ చేస్తున్న ప్రభుత్వ విధానాన్ని ప్రజలు ఎండగట్టాలని కోరారు. పథకాల పేరుతో 10శాతం ఇచ్చి మిగతా 90శాతం జేబుల్లో వేసుకుంటున్న దోపిడీని ప్రశ్నించాలని పేర్కొన్నారు. ప్రభుత్వ పన్నులు, బాదుడుపై ప్రతిపక్ష తెలుగుదేశం చేస్తున్న పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని