Chandrababu: పోలవరం ప్రాజెక్టు నుంచి చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్

పోలవరం ప్రాజెక్టు నుంచి వైకాపా ప్రభుత్వానికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 72 శాతం పనులు పూర్తి చేశామన్నారు.

Published : 07 Aug 2023 18:49 IST

పట్టిసీమ: పోలవరం ప్రాజెక్టు నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు.. వైకాపా ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 72 శాతం పనులు పూర్తి చేశామన్నారు. జగన్‌ సర్కారు ఎంత శాతం పనులు పూర్తి చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతగా చంద్రబాబు తొలిసారి పోలవరంలో పర్యటించారు. పోలవరం ప్రాజెక్టు డ్యామ్‌పై ఇవతలి నుంచి అవతలి గట్టు వరకు 1.8 కి.మీ కాలినడకన పనులను పరిశీలించారు. కుంగిన గైడ్ బండ్‌నూ సందర్శించి మాట్లాడారు.

‘‘పోలవరం ప్రాజెక్టుపై ప్రజలకు వాస్తవాలు తెలియాలి. అసమర్థ పరిపాలన వల్ల డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతింది. డయాఫ్రమ్‌ వాల్‌.. కొత్తది కట్టాలా? మరమ్మతులు చేస్తారా?చూడాలి. మరమ్మతులు చేస్తే 85 మీటర్లు లోపలికి వెళ్లాలి. పోలవరం.. సున్నితమైన ప్రాజెక్టు.. ప్రమాదకరమైన ప్రాజెక్టు.. దీనిని మనం కాపాడుకోవాలి. తెదేపా హయాంలో పోలవరం ప్రాజెక్టుపై 83 సార్లు సమీక్ష చేశా. పోలవరం ఎత్తు 41.15 మీటర్లు ఉంచాలని జగన్‌ సర్కారుకు ఎందుకు అనిపించింది?’’ అని చంద్రబాబు ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని