గొంతు నొక్కాలని చూస్తున్నారు: దేవినేని

తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కేసులో సీఐడీ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారణ జరిగింది...

Updated : 30 Apr 2021 10:09 IST

అమరావతి: తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కేసులో సీఐడీ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విచారణ జరిగింది. సీఎం జగన్‌ మాటలను ట్యాబ్‌లో చూపిన అంశంపై అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ట్యాబ్‌, సంబంధిత ఆధారాలు కావాలని సీఐడీ అధికారులు కోరినట్లు సమాచారం. విచారణ ముగిసిన అనంతరం దేవినేని మీడియాతో మాట్లాడారు.‘‘తప్పుడు కేసులతో మా గొంతు నొక్కాలని చూస్తున్నారు. చంద్రబాబు పేరు చెప్పాలని సీఐడీ అధికారులు ఒత్తిడి చేశారు. ఆయన పేరు చెబితే నన్ను వదిలేస్తామన్నారు. మరోసారి విచారణకు రేపు, ఎల్లుండి హాజరుకావాలన్నారు’’ అని దేవినేని వ్యాఖ్యలు చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని