Revanthreddy: 8కోట్ల గోనె సంచులకు టెండర్లు వేసే దిక్కులేదు: రేవంత్‌రెడ్డి

అకాల వర్షాల కారణంగా తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

Updated : 29 Apr 2022 19:36 IST

నాగార్జునసాగర్‌: అకాల వర్షాల కారణంగా తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. వర్షానికి పంట తడిసిపోకుండా కనీసం టార్పాలిన్‌ పట్టాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని విమర్శించారు. మే 6న వరంగల్‌లో నిర్వహించనున్న రాహుల్‌గాంధీ సభ కోసం నాగార్జున సాగర్‌లో ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ సన్నాహక సమావేశం జరిగింది. కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు జానారెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డితో కలిసి రేవంత్‌ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ‘‘రైతులను ఆదుకునేందుకు ఏం చర్యలు తీసుకుందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. 7వేల ఐకేపీ కేంద్రాలు తెరవాల్సి ఉంటే.. 2,300 మాత్రమే తెరిచారు. రాష్ట్రంలో 15కోట్ల గోనె సంచుల అవసరముంది. 8 కోట్ల గోనె సంచులకు టెండర్లు పిలిస్తే.. టెండరు వేసే దిక్కులేదు. సిరిసిల్ల, సిద్దిపేటలో అకాల వర్షాల కారణంగా లక్షలాది క్వింటాళ్ల పంట కల్లాల్లో తడిసి మొలకెత్తుతుంటే కనీసం పంటను కాపాడుకునేందుకు టార్పాలిన్‌లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.  కల్లాల్లో తడిసిన ధాన్యానికి రూ.1,960 గిట్టుబాటు ధర ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కాంగ్రెస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది’’ అని రేవంత్‌రెడ్డి తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని