విశాఖ ఉక్కుపై ప్రధాని మోదీకి డి.రాజా లేఖ

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు.

Published : 24 Feb 2021 01:32 IST

దిల్లీ: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. విశాఖ ఉక్కు పరిశ్రమ.. ఏపీ ప్రజల భావోద్వేగాల అంశమని అందులో పేర్కొన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు నవరత్న హోదా ఉందని గుర్తు చేశారు.

ప్రైవేటీకరణ చేస్తే రూ.లక్షల కోట్ల విలువైన భూమిని ప్రైవేట్‌ కంపెనీలు లాక్కుంటాయన్నారు. స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు కేంద్రం ఎలాంటి ప్రయత్నం చేయలేదని.. సొంత గనులు కేటాయించలేదని ఆక్షేపించారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేట్‌ శక్తులకు అప్పగించడంపై పునరాలోచించాలని ప్రధానిని కోరారు.  వందశాతం పెట్టుబడి ఉపసంహరణకు తాము పూర్తిగా వ్యతిరేకమని లేఖలో రాజా పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని