DK Aruna: పార్టీ మార్పు ప్రచారంపై స్పందించిన డీకే అరుణ

పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఖండించారు.

Published : 26 Oct 2023 10:53 IST

హైదరాబాద్‌: పార్టీ మారుతున్నారంటూ జరుగుతున్న ప్రచారంపై భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు, మాజీ మంత్రి డీకే అరుణ ఖండించారు. తాను పార్టీ మారే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీలో చేరబోనని తెలిపారు. ‘‘కాంగ్రెస్‌ నాయకులు మైండ్‌ గేమ్‌ ఆడుతున్నారు. భాజపా అధిష్ఠానం నన్ను గుర్తించి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చింది. ప్రధాని మోదీ నాయకత్వంలో పని చేసేందుకు అదృష్టం ఉండాలి’’ అని డీకే అరుణ అన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని