LS Polls: తమిళనాడులో 9.. పుదుచ్చేరిలో ఒక సీటు.. డీఎంకే- కాంగ్రెస్‌ డీల్‌ ఖరారు

డీఎంకే, కాంగ్రెస్‌ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. తమిళనాడులో తొమ్మిది, పుదుచ్చేరిలో ఒక స్థానాన్ని కాంగ్రెస్‌ పార్టీకి కేటాయించింది.

Published : 09 Mar 2024 22:14 IST

చెన్నై: లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి అధికార డీఎంకే (DMK), కాంగ్రెస్‌ (Congress)ల మధ్య సీట్ల సర్దుబాటు ఖరారైంది. తమిళనాడు (Tamil nadu)లో తొమ్మిది సీట్లు, పుదుచ్చేరిలో ఒక స్థానాన్ని హస్తం పార్టీకి కేటాయించింది. డీఎంకే అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (MK Stalin), టీఎన్‌సీసీ చీఫ్ కె.సెల్వపెరుంతగై, ఏఐసీసీ నేతలు కేసీ వేణుగోపాల్, అజోయ్ కుమార్ సమక్షంలో ఈ ఒప్పందం కుదిరింది.

లోక్‌సభ ఎన్నికల్లో మేం పోటీ చేయట్లేదు: కమల్‌హాసన్‌

కాంగ్రెస్, డీఎంకేల మధ్య బంధం చెక్కుచెదరలేదని, తమ కూటమి తమిళనాడు, పుదుచ్చేరిల్లో మొత్తం 40 సీట్లను గెలుచుకుంటుందని కేసీ వేణుగోపాల్ విశ్వాసం వ్యక్తంచేశారు. 2019 ఎన్నికల సమయంలోనూ కాంగ్రెస్‌కు పది స్థానాలు కేటాయించగా.. తొమ్మిది చోట్ల విజయం సాధించింది. ఈ కూటమితో ప్రముఖ నటుడు కమల్‌ హాసన్‌ కు చెందిన ‘మక్కల్‌ నీది మయం’ కూడా జట్టు కట్టిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని