‘చాలు మమతా జీ.. బెంగాల్‌ మార్పు కోరుతోంది’ 

బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపా మధ్య కొనసాగుతున్న తీవ్ర మాటల యుద్ధంతో .....

Updated : 10 Feb 2021 04:31 IST

టీఎంసీపై నడ్డా మాటల దాడి

కోల్‌కతా: బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ తృణమూల్‌ కాంగ్రెస్‌, భాజపాల మధ్య కొనసాగుతున్న తీవ్ర మాటల యుద్ధంతో రాజకీయాలు మరింతగా వేడెక్కాయి. అభివృద్ధి సంస్కృతికి పేరుగాంచిన బెంగాల్‌ను మమతా బెనర్జీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీలు నాశనం చేశాయని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆరోపించారు. నదియాలో మంగళవారం ఆయన  పరివర్తన్‌ ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా నడ్డా మాట్లాడుతూ.. నదియాలో తాము పరివర్తన్‌ ర్యాలీ ప్రారంభించామని, దీనిద్వారా ప్రజలని ఏకతాటిపైకి తీసుకొస్తామన్నారు. బెంగాల్‌ ప్రజలు నాయకత్వ మార్పు కోరుకుంటున్నారన్నారు. ‘ఇక చాలు మమతా జీ.. ప్రజలకు మార్పు కావాలి’’ అని  వ్యాఖ్యానించారు. రాబోయే ఎన్నికల్లో భాజపాదే విజయమన్నారు. ఇటీవల హల్దియాలో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ మమతా బెనర్జీ రాష్ట్ర అభివృద్ధి కోరుకోవడంలేదంటూ ప్రకటించిన విషయాన్ని నడ్డా ప్రస్తావించారు. మోదీ బెంగాల్‌కు వస్తారని, అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకొస్తారని చెప్పారు. మరోవైపు, భాజపాపై చేపట్టిన రథయాత్రను ఐదు నక్షత్రాల బస్సుతో పోల్చిన మమత.. ఇది బయటి వ్యక్తులు రాష్ట్రాన్ని సందర్శించేందుకు ఉపయోగపడుతోందంటూ ఎద్దేవా చేశారు. 

ఇదీ చదవండి..

ఉత్తరాఖండ్‌లో నిరంతర పర్యవేక్షణ: అమిత్‌షా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని