Balineni Srinivasa Reddy: పార్టీ అధిష్ఠానం వారిపై చర్యలు తీసుకుంటే మంచిది: బాలినేని శ్రీనివాసరెడ్డి

తను పార్టీకి కట్టుబడి ఉండడాన్ని కొంతమంది అలుసుగా తీసుకున్నారని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఒంగోలులో బాలినేని మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

Updated : 05 May 2023 20:30 IST

ఒంగోలు: వైకాపా కోసం ఎంతో కష్టపడ్డానని.. పార్టీ కార్యకర్తల కోసం ఏదైనా చేస్తానని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ మేరకు ఒంగోలులో బాలినేని మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

బాలినేని మాట్లాడుతూ.. ‘‘నేను పార్టీకి కట్టుబడి ఉండడాన్ని కొంతమంది అలుసుగా తీసుకున్నారు. అనవసరంగా నాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఎవరిపైనా సీఎంకు ఫిర్యాదు చేయలేదు. అలాంటి మనస్తత్వం నాది కాదు. నేను టికెట్‌ ఇప్పించిన వారే నాపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేస్తున్నారు. నాపై ఆరోపణల వెనక ఎవరున్నారో మీరే తెలుసుకోవాలి. నా విమర్శకులకు సిగ్గు లేదు.. అలాంటి నీచులకు పార్టీపై ప్రేమలేదు. నా వ్యతిరేకుల మాదిరిగా నేను పార్టీకి నష్టం చేయలేదు. వారిపై పార్టీ అధిష్ఠానం చర్యలు తీసుకుంటే మంచిది. ఈ వివాదాలకు అధిష్ఠానమే ముగింపు పలుకుతుందని ఆశిస్తున్నా. ఒంగోలు నియోజకవర్గంలో నాపై ఎలాంటి వ్యతిరేకత లేదు. 3 జిల్లాల్లో గడపగడపకు తిరగలేకనే పార్టీ కో-ఆర్డినేటర్‌ పదవికి రాజీనామా చేశా’’ అని బాలినేని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని