Loksabha Polls: ఆ లెక్కలు తేలితే.. మొదటి పేరు గడ్కరీదే: ఫడణవీస్‌

లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మహారాష్ట్రలో అధికార ‘మహాకూటమి’ అభ్యర్థుల్లో మొదటి పేరు నితిన్‌ గడ్కరీదే వస్తుందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు.

Published : 09 Mar 2024 00:33 IST

ముంబయి: లోక్‌సభ ఎన్నికల (Lok Sabha Elections)కు సంబంధించి మహారాష్ట్రలో అధికార ‘మహాకూటమి’ పక్షాల మధ్య ఒక్కసారి సీట్ల పంపిణీ ఖరారయితే.. కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ (Nitin Gadkari) పేరే మొదట వస్తుందని ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ తెలిపారు. భాజపాకు రాజీనామా చేసి వస్తే.. ‘మహావికాస్‌ అఘాడీ’ తరఫున పోటీకి గడ్కరీకి అవకాశం కల్పిస్తామని శివసేన (యూబీటీ) అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై ఫడణవీస్‌ ఈమేరకు స్పందించారు. ఠాక్రే ప్రకటనను తోసిపుచ్చుతూ.. గడ్కరీ వంటి జాతీయ నేతకు అటువంటివారు ఆఫర్ ఇవ్వడమంటే.. అమెరికాకు అధ్యక్షుడిగా చేస్తానంటూ ఒక సాదాసీదా వ్యక్తి మరొకరికి హామీ ఇవ్వడం లాంటిదేనని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

‘‘రాష్ట్రంలో అధికార మహాకూటమి తన ఎంపీ సీట్ల పంపకాన్ని పూర్తి చేసిన అనంతరం.. అభ్యర్థుల్లో నితిన్ గడ్కరీ పేరే మొదట వస్తుంది. ఆయన మా ప్రముఖ నేత. నాగ్‌పుర్ నుంచే పోటీ చేస్తారు. ఇటీవల భాజపా మొదటి జాబితా విడుదలైన సమయంలో అధికార పక్షాల (భాజపా, శివసేన, ఎన్సీపీ) మధ్య ఎటువంటి చర్చలు జరగలేదు’’ అని మీడియాతో ఫడణవీస్‌ తెలిపారు. ఠాక్రే సొంత పార్టీయే చితికిపోయిందని విమర్శించారు. ఇదిలాఉండగా.. ‘‘గడ్కరీ దిల్లీ ముందు తలవంచే బదులు రాజీనామా చేయాలని, ఆయన్ను అఘాడీ అభ్యర్థిగా నిలబెడతాం’’ అని ఇటీవల ఓ సభలో ఉద్ధవ్‌ మాట్లాడారు. ఎన్నికల వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు